కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. డీజీల్ ధర భారీగా తగ్గింపు

కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. డీజీల్ ధర భారీగా తగ్గింపు

కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీల్‌పై ప్రస్తుతం ఉన్న 30 శాతం వ్యాట్ ను 16.75 శాతానికి తగ్గించింది. ఈ విషయాన్ని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా ప్రభావం ఢిల్లీలోని ఆర్ధిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని.. మళ్లీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు డీజీల్ పై వ్యాట్ ను 16.75కి తగ్గిస్తున్నామని.. దీంతో ఢిల్లీలో డీజీల్ ధరలు భారీగా తగ్గుతాయని అన్నారు. లీటర్ పై ఏకంగా 8.35 రూపాయలు తగ్గుతుందని తెలిపారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం మే 4న పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను 30 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కాగా.. ఆర్థిక వ్యవస్థను లేవనెత్తేందుకే ప్రస్తుతం డీజిల్ ధర తగ్గించామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఆర్థిక వ్యస్థను లేవనెత్తేందుకు తీసుకున్న అనేక చర్యల్లో వ్యాట్ తగ్గించడం ఒకటి. ఇటీవలే మేము నిరుద్యోగులు, కంపెనీలను ఒకదగ్గరికి చేర్చే వేదికను ప్రారంభించామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story