అయోధ్యలో పూజారితో పాటు 16 మందికి కరోనా..

అయోధ్యలో పూజారితో పాటు 16 మందికి కరోనా..

మొదలైనా పెట్టలేదు.. రాములోరి గుడికి అప్పుడే ఆటంకాలు ఎదురయ్యాయి. రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమి పూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా పరీక్షలు చేయించగా ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. కట్టుదిట్టమైన కరోనా ఆంక్షల మధ్య శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 50 మంది వీఐపీలు ఈవెంట్ కు హాజరుకానున్నారు. భూమి పూజ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించే నలుగురు పూజారుల్లో ఒకరైన ప్రదీప్ దాస్ కొవిడ్ బారిన పడ్డారు. బుధవారం కొందరు మీడియా వ్యక్తులు ఆయనను ఇంటర్వ్యూ చేశారు. దీంతో వారు కూడా ఆందోళన చెందుతున్నారు. యూపీ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. అయోధ్యలో బుధవారం ఒక్కరోజే 66 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 13 మంది కరోనాతో మృతి చెందారు.

Tags

Read MoreRead Less
Next Story