జయా జైట్లీకి నాలుగేళ్లు జైలు శిక్ష

జయా జైట్లీకి నాలుగేళ్లు జైలు శిక్ష

సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీకి ఢిల్లీ కోర్టులో షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జయా జైట్లీతో పాటు మరో ఇద్దరికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. 2001లో జరిగిన రక్షణ ఒప్పందంలో అవినీతి జరిగిందని.. ఇందులో జయా జైట్లీ భాగమయ్యారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో మొత్తం ముగ్గురికి నాలుగేళ్లు జైలు శిక్ష, ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు జరిమానా కూడా విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. కాగా, ముగ్గురు దోషులు సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాలని సీబీఐ న్యాయమూర్తి జడ్జి వీరేందర్ భట్ ఆదేశించారు. ఈ అవినీతి కేసుల్లో జయా జైట్లీతో పాటు సమతా పార్టీ మాజీ నేత గోపాల్ పచేర్వాల్, మేజర్ జనరల్ ఎస్‌పీ ముర్గయి ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story