రిలయన్స్‌ జియోకు పెట్టుబడులతో పాటు లాభాల వరద

రిలయన్స్‌ జియోకు పెట్టుబడులతో పాటు లాభాల వరద

ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా అవతరించిన జియో 2020-21 ఫైనాన్షియల్‌ ఇయర్‌ తొలి త్రైమాసికానికి ఆర్ధిక ఫలితాలు వెల్లడించింది. అందరూ ఊహించినట్టే భారీ లాభాలు చూపించింది. గత ఏడాది అంటే 2019-20 తొలి త్రైమాసికంలో జియో రూ.891 కోట్లు లాభాలు రాగా.. ఈ ఏడాది ఇదే కాలానికి అనూహ్యంగా 183శాతం పెరిగి.. నికరంగా రూ.2520 కోట్లు లాభాలు తెచ్చింది. సంస్థ ఆదాయం 34శాతం పెరిగింది. మొత్తం 3 నెలల కాలంలో సేవల ద్వారా రూ.16,557 కోట్లు రాబట్టింది.

జూన్‌ 30నాటికి కంపెనీకి మొత్తం 398.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. సగటున ఒక్కో జియో కస్టమర్‌ నుంచి కంపెనీకి 3నెలల్లో రూ.140.3 ఆదాయం వచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉంది. వర్క్‌ ఫ్రంహోం కల్చర్‌ పెరిగింది. ఇది జియో సంస్థకు అనుకూలంగా మారింది. దీంతో అంచనాలను మించి లాభాలు గడించింది. వైరలెస్‌ డేటా ట్రాఫిక్‌ 30.2శాతం పెరగ్గా, 1420 కోట్ల జీబీ వినియోగించుకున్నారు కసమర్లు. లాక్‌డౌన్‌ సమయంలో రిలయన్స్‌ కస్టమర్లు సగటున నెలకు 12.1 GB ఇంటర్నెట్‌.. 756 నిమిషాలు వాయిస్‌ కాల్స్‌ సేవలను పొందారు. జియో కంపెనీలో ఎక్సెస్‌ రెవిన్యూతో కలిపి ఆదాయం 19,513 కోట్లుగా ఉంది. ఇది 33.7శాతం పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి EBITDA 55.4శాతం పెరిగి రూ.7281 కోట్లుగా ఉంది.

జియో కంపెనీలోకి ఇటీవల కాలంలో రూ. 1,52,056 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫేస్ బుక్‌, గూగుల్‌, సిల్వర్‌లేక్, కేకేఆర్‌, ముబదాలా, ADIA, TPG, L Catterton, సౌదీ ప్రభుత్వం సహా మొత్తం 13 సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌ చేశాయి. కంపెనీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కు ఇంకా 66.48శాతం వాటా ఉంది. కంపెనీ వాల్యూ కూడా 13లక్షల కోట్లు దాటింది. అటు షేర్లు.. ఇటు జియో సర్వీసులు కంపెనీకి లాభాలపంట పండిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story