మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత

బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్యాలరావు శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా మాణిక్యాలరావు ఇటీవల కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. 2014లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతిపట్ల బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Recommended For You