ఢిల్లీలో కరోనా కట్టడికి అనుసరించిన విధానం

ఢిల్లీలో కరోనా కట్టడికి అనుసరించిన విధానం

కరోనాకు కేంద్రంగా ఉండే ఢిల్లీ ఇటీవల కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఢిల్లీలో ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీ కరోనా ప్రభావం విపరీతంగా ఉండేది. డిల్లీలోని మొత్తం 20 జిల్లాల్లో ఈ ప్రాంతలోనే మహమ్మారి తీవ్రంగా విజృంభించేంది. జూన్ లో ప్రతీరోజు 350 కేసులు నమోదయ్యేవి. కానీ, జూలై నాటికి తగ్గుముఖం పట్టి రోజుకు 100 కేసులు నమోదవుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీని మూడు భాగాలు చేశారు. ఈశాన్య ఢిల్లీ తరువాత రాజధానిలో ఎక్కువ జనాభా ఇక్కడే ఉంటారు. ఇక్క‌డ‌ చదరపు కిలోమీటరుకు 27,730 మంది ఉంటున్నారు. జనాభ ఎక్కువ ఉండటంతో ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తిపై ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జిల్లాలో 28 శాతం మందికి వ్యాధి సోకినట్లు వెల్ల‌డ‌య్యింది. దీంతో వైద్యాధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 5.8 లక్షల జనాభా ఉండగా.. ఇప్పుడు 10,761 మంది కరోనా బాధితులు ఉన్నారు. దేశంలో అత్యధికంగా క‌రోనాకు ప్రభావితమైన 20 జిల్లాల్లో సెంట్ర‌ల్ ఢిల్లీ ఒక‌ట‌ని, ఈ ప్రాంత భౌగోళిక స్వ‌రూపాన్ని, ప్రజల తీరుతెన్నుల‌ను అర్థం చేసుకుని క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ణాళిక‌లు వేశామ‌ని సెంట్రల్ ఢిల్లీ డిఎం నిధి శ్రీవాస్తవ అన్నారు. క‌రోనా సోకిన వారిని వెంట‌నే క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డంలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో క్ర‌మంగా కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌చ్చింద‌ని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story