ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 10,374 కేసులు

ఏపీలో కరోనా కేసులు ప్రతీ రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 10,376 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,038కి చేరాయి. అటు, ఒక్కరోజే 68 కరోనా మరణాలు నమోదవ్వగా.. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,349కి చేరింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకొని 60,969మంది డిశ్చార్జ్ అవ్వగా.. 75,720మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇతర దేశాలతో పోల్చుకుంటే కరోనా కేసులు బారీగా నమోదవుతున్నాయి. అటు, రికవరీ రేటు కూడా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగా ఉంది. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Recommended For You