మహారాష్ట్రలో కరోనా కలకలం

మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్‌ కేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 9,601 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా 322 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,31,719 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి 2,66,883 మంది చికిత్సకు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1,49,214 మంది వివిధ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 15,316 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర రాజధాని ముంబైలో 1,15,346 కేసులు నమోదుకాగా 6,395 మంది మృతి చెందారని బ్రిహాన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.

Recommended For You