ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారీ ఉపాధి అవకాశాలు

వచ్చే ఐదేళ్లో భారత్లో రూ.11లక్షల కోట్ల విలువైన మొబైల్‌ డివైసెస్‌ మరియు కాంపోనెంట్స్‌ తయారుచేయడానికి కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రొడక్షన్‌ లింక్‌ ఇన్సెంటీవ్‌ -PLI కింద 22 ఎలక్ట్రానిక్‌ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

ప్రపంచంలోనే టాప్‌ 5 కంపెనీలు ఇందుకు ముందుకురావడంపై ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు. శాంసంగ్‌, హాన్‌ హోయ్‌, రైజింగ్‌ స్టార్‌, ఫాక్స్‌ కాన్‌, విస్ట్రాన్‌ కూడా ఉన్నాయి. యాపిల్‌ సంస్థలో ఒప్పందాలు చేసుకున్న హాన్‌ హోయ్‌, రైజింగ్‌ స్టార్‌, ఫాక్స్‌ కాన్‌, విస్ట్రాన్‌ సంస్థలు ఉండటం వల్ల ఇక నుంచి దేశీయంగానే ఐఫోన్లు ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుంది.

వచ్చే ఐదేళ్లలో దాదాపు రూ.11లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. దీంతో పాటు 3లక్షల మందికి నేరుగా, మరో 9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 37శాతం వాటా ఉన్నా యాపిల్‌, 22శాతం వాటా ఉన్న శాంసంగ్‌ సంస్థలకు చెందిన డివైస్‌లు ఇక ఇండియాలోనే అత్యధికంగా తయారవుతాయి.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంస్థలు ఒప్పందాలు చేసుకుని ఉత్పత్తి రంగంలో మంచి ఫలితాలు చూపిస్తే వారికి 4 నుంచి 6శాతం రాయితీలు ఇస్తారు. ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇందులో పాల్గొనదలిచినవారు ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు భాగస్వామ్యం అయ్యాయి.

Recommended For You