సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం

సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించిన కేంద్రం

బాయ్వుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ తోపాటు బీహార్, మహారాష్ట్ర నేతల మధ్య పొలిటికల్ హీట్ పెంచిన ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుశాంత్ మృతిపై సిబిఐ విచారణకు సిఫారసారు చెయ్యాలని బీహార్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య రోజునుంచి అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. ఈ కేసులో సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలని బీహార్ సీఎం నితీష్ కుమార్ మంగళవారం కేంద్రానికి సిఫారసు చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తును బీహార్ గవర్నర్ ఫాగ్ చౌహన్ కూడా అంగీకరించారు.. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు తదుపరి విచారణను సిబిఐ చేపట్టాలని సూచించారు.

కాగా తన కొడుకు మరణానికి రియా చక్రవర్తే కారణమని ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. మరోవైపు సుశాంత్ ఘటనలో పాట్నాలో తనపై దాఖలైన కేసు విచారణను ముంబైకి బదిలీ చెయ్యాలని కోరుతూ.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారించిన ఉన్నత న్యాయస్థానం ఈ కేసులో ఇరువర్గాలు మూడు రోజుల్లోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తును వారం పాటు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story