ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదు: ఎయిమ్స్ డాక్టర్

ప్లాస్మా థెరపీతో ప్రయోజనం లేదు: ఎయిమ్స్ డాక్టర్

కొవిడ్ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేస్తే దాన్ని కొవిడ్ రోగులకు ఎక్కిస్తున్నారు. కోలుకున్న వారికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. ఈ చికిత్స ద్వారా మరణాల రేటును కొంతవరకైనా అరికట్టవచ్చనే ఉద్దేశంతో.. అయితే ఈ ప్లాస్మా థెరపీ ద్వారా ప్రయోజనం లేదని.. అలాగని ప్రమాదమూ లేదని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు. ప్లాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కోవిడ్ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశోధన జరిపినట్లు గులేరియా వెల్లడించారు. ఒక బృందానికి సాధారణ చికిత్స, మరొక బృందానికి ప్లాస్మా చికిత్స అందించగా.. రెండింటిలో మరణాల రేటు సమానంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత కోసం పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ప్లాస్మా థెరపీతో చికిత్స ఒక విధంగా రక్తమార్పిడి లాంటిదే అనే వైద్యులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story