విజయవాడ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

విజయవాడ అగ్ని ప్రమాదంపై చంద్రబాబు దిగ్బ్రాంతి

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా సెంటర్ లో అగ్ని ప్రమాదం చాలా బాధకరమని అన్నారు. గాయాలుపాలైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాగా.. రమేష్ ఆస్పత్రి ఆద్వర్యంలో హోటర్ స్వర్ణ పేలస్ లో పెయిడ్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ముప్పై మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. పది మంది ఆస్పత్రి సిబ్బంది కూడా ఉన్నారు. షార్ట్ సర్యూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 11మంది మరణించారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించడంతో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది భయంతో భవనంపై నుంచి దూకేసారు. వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలుస్తుంది. 15మంది రోగులను వివిధ ఆస్పత్రులకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story