అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటుంది: ఇంటెలిజెన్స్

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటుంది: ఇంటెలిజెన్స్

అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే, ఈ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటుందని.. అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ కు వ్యతిరేకంగా రష్యా పావులు కదుపుతుందని వెల్లడించింది. ట్రంప్‌కు సహాయపడేలా ప్రచారంలో చాలా రకాల పద్దతులను అనుసరిస్తుందని తెలిపింది. ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని రష్యా కోరుకుంటున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. అయితే, అదే సమయంలో చైనా గురించి కూడా ప్రస్తావించిన అధికారులు.. ట్రంప్ మరోసారి అధికారం చేపట్టాలని చైనా కోరుకోవడం లేదని తెలిపింది. ట్రంప్ వైఖరితో చైనాకు చాలా నష్టం జరుగుతున్నట్టు డ్రాగన్ అభిప్రాయంపడుతుంది. తరచూ చైనాపై ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేయడం తమకు ఇబ్బందిగా బావిస్తుంది. అంతేకాకుండా చైనాపై ట్రంప్‌ అనేక ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశానికి నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోవాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుంటుందని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను శ్వేతసౌధం అభ్యంతరం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story