కరోనా కాలంలో 'అల్లం'కి డిమాండ్..

కరోనా కాలంలో అల్లంకి డిమాండ్..

అల్లంలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. రోజూ అల్లం టీ తాగితే ఆరోగ్యంగా ఉంటుందని ఇది వరకే తెలుసు. ఈ కరోనా వచ్చి అందరి ఇంట్లో అల్లం తప్పని సరి వస్తువు అయిపోయింది. నిజానికి అల్లం తీసుకుంటే కరోనా వైరస్ వుంటుందో పోతుందో ఎవరూ చెప్పలేదు కానీ భారతీయ మసాలా దినుసుల్లో ఒకటైన అల్లాన్ని విరివిగా వాడేస్తున్నారు. మనిష శరీరంలో రోగ నిరోధక వ్యవస్త పనితీరును అల్లం మెరుగు పరుస్తుంది. తద్వారా కరోనా వైరస్ తో పోరాడే శక్తి వస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

ఇంకా ఇందులో ఉన్న జింజెరోల్ వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటివి దరిచేరవు. ఒకవేళ వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆగకుండా వస్తున్న దగ్గును నివారించాలంటే చిన్న అల్లం ముక్క తీసుకుని దానికి చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే కాస్త తగ్గుముఖం పడుతుంది. అదే విధంగా రోజూ అల్లాన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ఉత్తమం. అల్లం టీ, అల్లం చారు, అల్లం పచ్చడి ఇలా ఎలా తీసుకున్నా శరీరానికి మేలు చేస్తుంది.

మధుమేహ సమస్య ఉన్నవారు తీసుకుంటే రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. ఆర్థరైటిస్ సమస్య ఉన్న వారు అల్లం తీసుకోవడం చాలా మంచిది. కీళ్ల నొప్పిని తగ్గించడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అజీర్తి సమస్యలకు చక్కని ఔషధంలా అల్లం పని చేస్తుంది. కరోనా సంగతి పక్కన పెడితే అల్లం తీసుకోవడం అన్ని వేళలా ఆరోగ్యకరమే.

Tags

Read MoreRead Less
Next Story