సెక్యూరిటీ గార్డులకు కరోనా.. మాజీ ప్రధానికి పరీక్షలు

నేపాల్‌లో, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) సహ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్ప్ కమల్ దహల్ 'ప్రచండ' కు ఆరుగురు సెక్యూరిటీ గార్డులకు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దాంతో వారిన ఐసోలేషన్ కు తరలించారు. వారంతా మొన్నటివరకూ ప్రచండ నివాసంలో విధులు నిర్వర్తించారు. తన సెక్యూరిటీ గార్డులకు కరోనా సోకడంతో ప్రచండ సహా మిగిలిన సెక్యూరిటీ గార్డులకు కరోనా పరీక్షలు చేశారు అధికారులు.

ముందు జాగ్రత్తగా ప్రచండను ఖ్వారంటైన్ కు తరలించారు. అయితే ఆయన నివేదిక నెగటివ్ గా వచ్చింది. కాగా నేపాల్ ప్రధానిగా పనిచేసిన ప్రచండ.. కొంతాలంగా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి)కి సహా అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రధాని పదవి విషయంలో ప్రస్తుత ప్రధాని కేపీ శర్మ ఒలికి, ప్రచండకు మధ్య వివాదం నడుస్తోంది. ఇదిలావుంటే నేపాల్‌లో ఇప్పటివరకు 22 వేల 592 కరోనా కేసులు నమోదయ్యాయి.. 73 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story