ఆడబిడ్డలకు ఆస్తి హక్కు.. సుప్రీం సంచలన తీర్పు

ఆడబిడ్డలకు ఆస్తి హక్కు.. సుప్రీం సంచలన తీర్పు

మహిళలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిలో వాటా కలిగి ఉండటానికి కుమార్తెల హక్కులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తల్లిదండ్రుల ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది..

ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆడబిడ్డకు ఆస్తి వారసత్వ హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story