అణ్వాయుధాలను నిషేధించండి: జపాన్

ప్రపంచదేశాలు అణుఆయుధాలను నిషేధించాలని జపాన్ మరోసారి విజ్ఞప్తి చేసింది. జపాన్ లోని ముఖ్యనగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా బాంబ్ దాడి చేసి 75 ఏళ్ల పూర్తైనా సందర్భంగా నాగసాకి పీస్‌ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్‌ టొమిహిమ టావ్‌ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను వ్యతిరేకంగా శాంతి సందేశం చేస్తుంటే.. అమెరికా, రష్యా లాంటి దేశాలు అణ్వాయుధాలను పెంచుకుంటున్నారని ఆరోపించారు. 2017లో జరిగిన అణుఆయుధాల నిషేధ

ఒప్పందంపై ప్రపంచ దేశాలతోపాటు, జపాన్‌ ప్రభుత్వఅధికారులను సంతకాలు చేయాలని ఆయన కోరారు.

అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని జపాన్ ప్రధాని షింజో అబే విమర్శించారు. రష్యా, అమెరికా దేశాలు అణు ఆయుధాలు పెంచుకుంటున్నాయని.. అయితే, ప్రపంచ శాంతి కోసం వాటిని తగ్గించుకోవాలని కోరారు. కాగా రెండవ ప్రపంచయుద్దంలో 1945 ఆగస్టు 6,9 తేదీలలో అమెరికా.. జపాన్ లోని హిరోసిమా, నాగసాకి ప్రాంతాలపై అణుబాంబు దాడి చేసింది. ఈ దాడిలో 1,40,000 మంది చనిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story