స్కూళ్లలోకి చొరబడిన కరోనా.. 97 వేల మంది విద్యార్థులకు..

స్కూళ్లలోకి చొరబడిన కరోనా.. 97 వేల మంది విద్యార్థులకు..

వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం మేరకు జూలై నెల నుంచి స్కూల్స్ తెరిచారు. దీంతో జార్జియా, ఇండియానా, మిసిసిప్పీ నగరాల్లో రద్దీగా ఉన్న స్కూల్స్ లోకి కరోనా చొరబడింది. స్కూల్స్ తెరిచిన మొదటి రోజే వందల సంఖ్యలో విద్యార్థులు కరోనా బారిన పడినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. జూలై నెల ఆఖరు నాటికి 97 వేలకు పైగా విద్యార్థులు కరోనా బారిన పడినట్లు తెలిసింది. ఈ మేరకు పిల్లల ఆరోగ్య సంస్థలు విడుదల చేసిన నివేదికను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్నా స్కూల్స్ తెరవాలని పట్టుబట్టిన అధ్యక్షుడి మొండి వైఖరికి ఇది అద్ధం పడుతోందని ఆ దేశ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కరోనా కేసుల విషయంలో ప్రపంచదేశాల్లోనే అమెరికా ప్రధమ స్థానంలో ఉంది. ఇక కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1,63,000 లకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story