అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అసలుతో పాటు వడ్డీ కూడా చెల్లించండి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా వైరస్ తో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే వేతనాలు చెల్లించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్ పై విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది. రాష్ర ప్రభుత్వం వైరస్ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని అందుకే ఉద్యోగుల జీతాల్లో 50 శాతం చెల్లించాలనుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story