పార్లమెంట్ భవన నిర్మాణ రేసులో మూడు దిగ్గజ కంపెనీలు

పార్లమెంట్ భవన నిర్మాణ రేసులో మూడు దిగ్గజ కంపెనీలు

నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే టెండర్లకు కూడా పిలిచింది. ఈ భవన నిర్మాణ రేసులో మూడు కంపెనీలు ఉన్నాయి. ప్రీ క్వాలిఫికేషన్‌కు ఏడు కంపెనీలు దరఖాస్తు చేయగా.. చివరిగా ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, టాటా ప్రాజెక్ట్స్‌ను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (సీపీడబ్ల్యూడీ) ఎంపిక చేసింది. ఈ మూడు కంపెనీలు ఆన్లైన్ ద్వారా తమ ఫైనాన్సియల్ బిడ్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుందని సీపీడబ్ల్యూడీ తెలిపింది. భవన నిర్మాణాన్ని రూ. 889 కోట్లతో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story