టీబీ టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం..

టీబీ టీకా తీసుకున్న వారిపై కరోనా ప్రభావం..

క్షయ వ్యాధి నివారణకు వ్యాక్సిన్ తీసుకున్న వారికి కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా యువతకు దీని వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపింది. బెన్ గురియన్ యూనివర్శిటీ, హీబ్రూ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. అయితే ఈ వ్యాక్సిన్ ను ఇవ్వడం చాలా దేశాలు ఆపేశాయి. కొన్ని దేశాలు మాత్రమే ఈ టీకాను ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 55 దేశాలకు సంబంధించిన డేటాను పరిశీలించగా, ప్రతి 10 లక్షల మంది జనాభాలో కొవిడ్ ఇన్‌ఫెక్షన్, మరణాల స్థాయిని తగ్గించడంలో ఇది సాయపడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గడిచిన 15 ఏళ్లలో ఈ టీకాను పొందిన 24 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడిందని, అదే పెద్ద వయసు వారిలో మాత్రం దీని ప్రభావం లేదని అన్నారు. అయితే కొవిడ్ పై ఈ టీబీ వ్యాక్సిన్ ఎందుకు ప్రభావం చూపిస్తుంది అన్న విషయం మాత్రం శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story