కొవిడ్ స్పెషల్ బులెటిన్ అందించే అధికారికీ వైరస్..

కొవిడ్ స్పెషల్ బులెటిన్ అందించే అధికారికీ వైరస్..

కరోనా వైరస్ ఎవరినీ వదిలిపెట్టేటట్లు కనిపించడం లేదు. దాదాపుగా అందరూ కాస్త ముందూ వెనుక కొవిడ్ బారిన పడక తప్పదేమో అనిపిస్తోంది రోజూ వస్తున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తుంటే. తాజాగా ఆరు నెలల నుంచి కొవిడ్ వార్తలందిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. వైరస్ టెస్ట్ చేయించుకున్న తరువాత పాజిటివ్ రావడంతో కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం తాను ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నానని ట్వీట్‌లో అగర్వాల్ తెలిపారు. తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకుని గృహ నిర్శంధంలో ఉండాలని కోరారు.

కరోనా సంక్షోభ తీవ్రతను అగర్వాల్ ప్రభుత్వ జాతీయ మీడియా కేంద్రంలో ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు వివరించేవారు. ఇతర దేశాలలో వైరస్ వ్యాప్తి మందగించినప్పటికీ, భారతదేశం ఇప్పటికీ రోజుకు 60,000 కంటే ఎక్కువ కేసులను నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు24 లక్షలకు పైగా కేసులు యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్‌లలో నమోదయ్యాయి. భారతదేశంలో వైరస్ కారణంగా 48,000 మందికి పైగా మరణించారు.

భారతదేశం యొక్క రికవరీ రేటును ప్రభుత్వం హైలైట్ చేస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 4 శాతం కంటే తక్కువ మరణాలు దేశంలో ఉన్నాయని నిపుణులు తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబైతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అగర్వాల్ తన చివరి మీడియా సమావేశంలో.. జనాభా మరియు స్థాయిని బట్టి కరోనావైరస్ మహమ్మారిని అంచనా వేయలేమని చెప్పారు. కొవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక్క టీకానే ప్రస్తుతం మన ముందున్న ఆశ అని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story