23 లక్షల కిట్లు విదేశాలకు ఎగుమతి చేసిన భారత్

కరోనా వ్యాప్తి చెందుతున్న మొదటి రోజుల్లో కరోనా కిట్లు లేక భారత్ చాలా ఇబ్బందులు పడాల్సివచ్చింది. అయితే, ఇప్పుడు మాత్రం పరిస్తితులు మారాయి. కరోనా కిట్లును భారత్ నుంచి ఎగుమతి చేస్తుంది. జూలైలో భారత్ 23 లక్షల పీపీఈ కిట్లను 5 దేశాలకు ఎగుమతి చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలైలో ప్రభుత్వం ఎగుమతి నిబంధనలను సడలించిన తరువాత, వస్తు సామగ్రి యొక్క ప్రపంచ మార్కెట్లో భారత్ స్థానం సంపాదించింది. కేంద్ర ప్రభుత్వం పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు, వెంటిలేటర్లు మొదలైన వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరాచేస్తుండగా, రాష్ట్రాలు కూడా ఈ వస్తువులను నేరుగా కొనుగోలు చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story