సాయం కోరిన అమ్మాయికి సోనూ అదిరిపోయే రిప్లై..

సాయం కోరిన అమ్మాయికి సోనూ అదిరిపోయే రిప్లై..

ఆపదలో ఉన్న వారందరికీ సోనూ సూద్ ఓ దేవుడిలా కనిపిస్తున్నారు. అయిన దానికి కాని దానికి కూడా సహాయం కోరుతూ సరదాగా ఆటపట్టించేవారు కూడా మరి కొందరుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి తన మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ సరిగా లేదని.. దాన్ని పెరిగేటట్లు చేయమంటూ మంజు శర్మ ట్వీట్ చేసింది. దానికి సోనూ కూడా అంతే చమత్కారంగా సమాధానం చెప్పారు. రేపు ఉదయం వరకు ఆగండి.. నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నా.. ఓ వ్యక్తి కంప్యూటర్ రిపేర్ చేస్తున్నా.. ఇంకా వివాహ సమస్యలు పరిష్కరించడం, ట్రైన్ టికెట్లు బుక్ చేయడం, ఇళ్లకు సంబంధించిన నీటి సమస్యలు తీర్చడం వంటివి. కొంతమంది ఖాళీగా ఉన్న మహానుభావులు నాకిలాంటి గొప్ప గొప్ప పనులు చెబుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి అని మంజూ శర్మకు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు సోనూ సూద్ చాలా బిజీగా ఉన్నారు అని కామెంట్లు పెడుతున్నారు. భలే స్పందించారండి.. బాగా బుద్ది చెప్పారు అని సోనూని మరికొందరు ప్రశంసిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story