నలుగురు రైల్వే ప్రయాణికులను బలి తీసుకున్న..

ఎండవేడిమి నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. రైల్లో ప్రయాణిస్తుండగానే, వేసవి తాపాన్ని తట్టుకోలేక నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ 65 ఏళ్లు దాటినవారే. వారణాసి, ఆగ్రాలను చూడడానికి వచ్చిన బృందంలో వీళ్లు కూడా ఉన్నారు. ట్రైన్ బయల్దేరిన కాసేపటికే ఎండవేడిమి భయంకరంగా పెరిగిపోయింది. ఆ దెబ్బకు నలుగురు వృద్ధులు అస్వసతకు లోనయ్యారు. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వైద్యులు వచ్చి సాయం అందించేలోపే కుప్పకూలిపోయారు. మరో ప్రయాణికుడు కూడా తీవ్రంగా అనారోగ్యం పాలవడంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

9 ఏళ్ల నా కోరిక నెరవేరింది.. - రోజా

Tue Jun 11 , 2019
మంత్రిపదవులు ఆశించి.. భంగపడ్డ నేతలు ఒక్కక్కరుగా ముఖ్యమంత్రి జగన్‌ తో సమావేశమయ్యారు. నగరి ఎమ్మెల్యే రోజా, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చి కలిశారు. తమ అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసినా పదవులు దక్కకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురైనట్టు జగన్‌ తో అన్నట్టు తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగానే మంత్రిపదవులు ఇవ్వలేకపోయామని భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని జగన్‌ వారికి వివరించారు. […]