ఏడుగురు అమ్మాయిలు ఒకే ఇంట్లో.. జీవితాంతం కలిసి..

చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నారు.. కలిసి పెరిగారు.. పై చదువుల పేరుతోనో.. పెళ్లి పేరుతోనో.. విడిపోవడం ఇష్టం లేదు.. విడిగా వుండడం అస్సలు ఇష్టం లేదు ఆ ఏడుగురు స్నేహితులకి. అందుకే ఓ అందమైన కలగన్నారు. అందులోని తమ కలల సౌధానికి రూపకల్పన చేశారు. 4కోట్లు ఖర్చుపెట్టి ఏడుగురు స్నేహితులు కలిసి తమ డ్రీం హౌస్ కట్టుకున్నారు. అందులో ఆనందంగా 2008 నుంచి పిల్లా పాపలతో జీవిస్తున్నారు. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నా కలిసే భోజనం చేస్తారు. కలిసే కబుర్లాడుకుంటారు. కలిసే ఎక్కడికైనా వెళతారు.

ఎంతబావుందో కదా ఈ ఆలోచన.. రక్త సంబంధీకులు కలిసుంటేనే గొడవలు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ ఏడుగురు స్నేహితులు ఒకే ఇంట్లో సంతోషంగా ఉంటున్నారంటే నిజంగా వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. దక్షిణ చైనాలోని గ్వంగ్స్యూలోని 7,535 చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న ఈ స్నేహితులు జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 18 ఏళ్ల వయసు నుంచే సంపాదనా పరులైన వాళ్లంతా కలిసి డబ్బుని దాచి పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలనుకున్నారు. ఇంతలో తమ కోసమే అన్నట్టుగా ఓ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాన్ని కొనుగోలు చేసి తమకు నచ్చిన విధంగా మార్పులు చేసుకున్నారు. అందులో ఏడు బెడ్ రూములు, పేద్ద డైనింగ్ హాల్, పేద్ద కిచెన్, లివింగ్ రూమ్ అన్నీ ఉండేలా తీర్చిదిద్దుకున్నారు. సాయింత్రపు సరదాలను ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇంటి వెనుక చెక్కతో ఓ వంతెన కూడా నిర్మించుకున్నారు. దాని మీద కూర్చుని తియ్యని కబుర్లు చెప్పుకుంటూ, వేడి వేడి టీని సిప్ చేస్తుంటారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటే ఇదేనేమో కదా.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

'సాయి' సహకారం.. స్కూల్‌ని దత్తత తీసుకున్న మెగా హీరో..

Tue Jul 9 , 2019
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న సూక్తిని అక్షరాలా నిజం చేస్తున్నారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మామూలు వ్యక్తులే ఎంతో కొంత తోటి వారికి సాయం చేస్తూ సేవాధృక్పథంలో ముందుంటే.. సెలబ్రిటీలం అయిన తాము కూడా ఎంతో కొంత సాయాన్ని అందిస్తే మనసుకి కాస్త ఊరటనిస్తుంది అని స్కూల్‌‌ని దత్తత తీసుకున్నారు. సాయి ధరమ్ ఇప్పటికే థింక్ పీస్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో […]