Live News Now
 • ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అఖిలేష్ త్రిపాఠి అరెస్ట్... 2013 అల్లర్ల కేసులో అఖిలేష్ అరెస్ట్..
 • అఖిలేష్ త్రిపాఠిపై 21 కేసులు నమోదు..
 • ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎంపిలు కేశినేని నాని,కొనకళ్ల నారాయణ..
 • దుర్గ గుడి ఫ్లైవోవర్ నిర్మాణ శంకుస్థాపనకు రావాలని గడ్కరీని ఆహ్వానించిన ఎంపిలు
 • తిరుపతి: బోర్డింగ్ విషయంలో ఎయిర్ పోర్టు అధికారిపై చేయిచేసుకున్న వైసిపి నాయకులు
 • వైసిపి ఎంపి మిథున్ రెడ్డి బోర్డింగ్ పాస్ పై గొడవ..
 • విజయవాడ: ఇసుక పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన సిఎం చంద్రబాబు
 • చిత్తూరు: మేయర్ దంపతుల హత్యకేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం..
 • చింటు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు.. కీలక పత్రాలు, 5 కత్తులు స్వాధీనం
 • ఖమ్మంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం.. తమ్మినేని వీరభద్రం
ScrollLogo నల్గొండ: సూర్యాపేట లాడ్జిలో టెన్త్ విద్యార్థినితో పోలీసులకు పట్టుబడ్డ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ScrollLogo భద్రతావలయంలో ముంబై నగరం..26-11 దాడుల్లో మృతులకు ముంబై ప్రజల సంతాపం ScrollLogo ముంబైలో అల్లర్లకు ఆస్కారం వుందన్న నిఘావర్గాల సమాచారంతో భద్రత కట్టుదిట్టం ScrollLogo కాళోజి హెల్త్ యూనివర్శిటి విసిగా కరుణాకర్ రెడ్డి నియామకం ScrollLogo గుంటూరు: త్వరలో దేవాదాయశాఖలోని ఖాళీల భర్తీ -మంత్రి మాణిక్యాలరావు ScrollLogo చిత్తూరు: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై పిడి యాక్టు నమోదు.. ScrollLogo హైదరాబాద్: సుల్తాన్ బజార్, అసెంబ్లీ మార్గంలో పాతవిధానంలో మెట్రో అలైన్ మెంట్ ScrollLogo గతంలో చేసుకున్న ఒప్పందం మేరకే పనులు కొనసాగిస్తాం- ఎల్అండ్ టి ఎండి గాడ్గిల్ ScrollLogo కృష్ణా: నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేత.. ScrollLogo రు.1.20 లక్షలు విద్యుత్ బకాయి చెల్లించలేదని సరఫరా నిలిపివేత..నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు
TV5 NEWS: Obama pardons turkey head on Thanksgiving Day

అమెరికా ప్రెసిడెంట్  నివాసమైన వైట్‌హౌస్ లోకి  రెండు టర్కీ కోళ్లను (వాటి పేర్లు హానెస్ట్, అబె)లను అధికారులు తీసుకువచ్చారు. తన ఇద్దరు కుమార్తెల సమక్షంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా వాటికి క్షమాభిక్ష పెట్టడంతో వాటిని మోర్వెన్ పార్క్‌కు తరలించారు.

థ్యాంక్స్ గివింగ్‌డే సందర్భంగా అధ్యక్షుడు ఒక కోడికి క్షమాభిక్ష పెట్టడం 1987నుంచి ఆనవాయితీగా వస్తోంది. అంతకు ముందు వరకు ఏటా జరిగే థ్యాంక్స్ గివింగ్‌డే ఉత్సవాల్లో కోళ్లను వండి ఆరగించడం జరిగేది. అయితే 1987లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్‌రీగన్ తన వద్దకు తీసుకువచ్చిన కోడిని తినేందుకు అంగీకరించకుండా క్షమాభిక్ష ప్రసాదించారు. అప్పటి నుంచి ఈ అనవాయితీని కొససాగిస్తున్నారు. 


టాలీవుడ్
 • TV5 NEWS: nenu naa prema katha release date wall poster
 • tv 5 news: size zero release wall poster
 • TV5 NEWS: love states wall poster
 • TV5 NEWS: Bhale Manchi Roju wall poster
 • tv 5 news: vishnu's sarada movie first look
సినీ గాసిప్స్
TV5 NEWS: arvinda swamy green signal is waiting for charan film

చరణ్ హీరోగా తెరకెక్కనున్న 'తనిఒరువన్' రీమేక్‌లో విలన్‌గా అరవింద్ స్వామిని ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో విలన్‌గా నటిస్తే 5 కోట్ల పారితోషికం ఇస్తామని చెప్పినా ఆయన ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తమిళ్లో వచ్చిన 'తని ఒరువన్' సినిమాలో ఆయనే విలన్‌గా నటించాడు. ఆ పాత్రని ఆయన అద్భుతంగా పండించాడు. 

తెలుగులో ఈ పాత్ర కోసం కొంతమంది నటులను అనుకున్నప్పటికీ, అరవింద్ స్వామి అయితేనే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు ప్రొడక్షన్ టీం. ఐతే ఒకే పాత్రలో మరోసారి నటించడం తనకి  ఇష్టం ఉండదని అరవింద్ స్వామి చెప్పినట్లుగా వార్తలు షికారు చేశాయి. అప్పటి నుంచి కూడా ఆయనని ఒప్పించే ప్రయత్నమే జరుగుతోంది. రెమ్యునరేషన్‌గా 5 కోట్లు ఇస్తామని చెప్పినా, ఆయన ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. 

tv 5 news: top hero drunk and hulchul in a hotel
మందు అన్ని బాధలను మరపిస్తుంది.. మందులో ఉన్న వ్యక్తి మనసులో ఉన్న మాట బయటికి వెల్లడిస్తాడు.. నాలుగు చుక్కల మందు లోపలికి వెళ్తే... లోపల ఉన్నదంతా బయటకి కక్కేస్తాడు.. ఈ విషయం మనం ఎక్కువుగా సినిమాల్లో చూసే సన్నివేశం. కాగా తెలుగు హీరోల్లో ఒక పేరున్న హీరో తాగితే ఊగిపోతూ తన నోటికి పనిచెప్పే హీరో ఒకరున్నారు. ఇటీవల హైటెక్ సిటీ దగ్గర ఉన్న సైబర్ సిటీలో ఓ హోటల్ లో మందు పార్టీలో ఆ టాప్ హీరో పాలుపంచుకున్నాడనే టాక్. ఈ హీరోగారు బాగా మందు పట్టించి ఒకే ఒక డైలాగ్ ను రిపీట్ చేశాడట. సినిమాకు వారసుల బెడద ఎక్కువైంది... అసలు తెలుగు సినీ రంగంలో ఉన్న ఇద్దరు వారసుల ఫేస్ కు సినిమాలు సూట్ కావు. కానీ సినీ నేపద్యంతో ఆ వారసులు సినిమాలు చేస్తున్నారు... ఒక వారసుడు ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు.. ఒకడు ఇప్పుడిప్పుడే ఒకట్రెండు సినిమాలతో కెరీర్ మొదలు పెట్టాడు.. అంటూ ఆ వారసుల ఫేస్ లపై తెగ సెటైర్స్ వేశాడట. దీంతో ఆ పార్టీకి వచ్చిన వారు ఆ డైలాగ్స్ కి బలవంతపు నవ్వులను పువ్వులుగా పూయించారట. ఆ పార్టీలో ఒక వ్యక్తి ఈ విషయాన్ని ఫిల్మ్ నగర్ లో స్ప్రెడ్ చేయడంతో ఆ వారసులెవరో అంటూ తెగ ఆలోచిస్తున్నారట. 

tv 5 news: ram charan to romance with isha sharma in thani oruvan remake
మెగా స్టార్ వారసుడిగా వెండితెరపై చిరుత మూవీ తో తెరంగ్రేటం చేసిన రాం చరణ్.. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ఎక్కువగా రిపీటెడ్ హీరోయిన్ కాజల్ మాత్రమే. కాగా చరణ్ తాజా సినిమా 'తని ఒరువన్' రీమేక్ లో హీరోయిన్ ని  చిత్ర యూనిట్ వెదికే పనిలో ఉన్నది. కాగా ఈ సినిమాలో చరణ్ కి జోడీ అంటూ రోజుకో హీరోయిన్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ గా సమంత, కాజల్, అమైరా దసూర్, శృతి హాసన్ లు వచ్చి వెళ్లారు. కాగా ఇప్పుడు చరణ్ తనతో నటించిన హీరోయిన్ చెల్లెలుపై మనసుపడ్డాడట. ఆమెనే తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట. వివరాల్లోకి వెళ్తే...
చరణ్ ఫస్ట్ సినిమాలో ఆడిపాడిన ఢిలీ భామ నేహా శర్మ చెల్లెలు ఇషా శర్మ తో తని ఒరువన్ లో జోడీ కట్టాలని భావిస్తున్నాడట. ఇప్పటికే నాగ్ చైతన్యతో ప్రేమమ్ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్న ఈ భామ మరి చరణ్ తో కూడా ఆడిపాడే ఛాన్స్ దక్కనున్నదా..! అప్పుడు అక్కతో రొమాన్స్ చేసిన చరణ్ ఇప్పుడు చెల్లెలితో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతాడా..? ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నది. 


tv 5 news: surya and trivikram combo confirmed?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ తో అ.. ఆ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కాగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంను అంగీకరించినట్లు.. దీనికి సంబంధించి అడ్వాన్స్ కూడా అందుకున్నట్లు టాక్ వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళ్తే...
కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య దర్శకుడు త్రివిక్రమ్ తో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. ఈ సినిమా ని సూర్య ఫ్రెండ్ జ్ఞానవేల్, తివిక్రమ్ సన్నిహితుడు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించనున్నారట. ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసుకున్న 24 తో పాటు సింగం 3 కూడా పూరి అయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనున్నదట. 2016 జూలై నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదని టాక్ వినిపిస్తున్నది. తను తొలిసారి నిర్మిస్తున్న ద్విభాషా చిత్రంతో కోలీవుడ్ లో కూడా తన విజయ బావుటా ఎగరవేయాలి త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కాగా ఇప్పటి వరకూ తన తమిళ సినిమాల రీమేక్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సూర్య తెలుగు లో నటిస్తున్న తొలి సినిమా ఇదే అవుతుంది. 

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే టీచర్ వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకున్న వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీపి కబురునిందించారు. ఇవాళ తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. త్వరలో టీచర్ల భర్తీ ప్రక్రియను చేపడతామన్నారు. ఈమేరకు డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని వెల్లడించారు.

inter exams schedule released by telangana govt
ఇంటర్మీడియేట్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికంగా విడుదల చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించడానికి తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫిబ్రవరి మూడో తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ మూడో తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ఆ లోపు ఇంటర్ పరీక్షలను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అయింది. మెయిన్స్ పరీక్షకు వెయిటేజి మార్కులను లెక్కించాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్ పరీక్షలను వీలున్నంత త్వరగా నిర్వహించడంతో పాటు ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడానికి ఇంటర్ బోర్డ్ రంగం సిద్ధం చేసింది. సో.. ఈ ఏడాది మార్చి రెండో తేదీ నుంచి పరీక్షలను నిర్వహించడానికి షెడ్యూల్ ను సోమవారం విడుదల చేశారు. 

AP Students Worry About DEd Hall Tickets-Prakasam and Kurnool districts ప్రకాశం జిల్లా గిద్దలూరులో డీఈడీ విద్యార్థులు రోడ్డునపడ్డారు. గడికోటలో ఉన్న కేఎల్ఆర్ డీఈడీ కాలేజ్ కు చెందిన 50 మంది రెండో సంవత్సరం విద్యార్థులకు హాల్ టిక్కెట్స్ రాలేదు. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అందుబాటులో లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో విద్యార్థులంతా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమకు హాల్ టిక్కెట్లు మంజూరయ్యేలా చూడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బాధితత విద్యార్థుల్లో అందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. తమకు హాల్ టిక్కెట్స్ రాకపోవడంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నారు. 
medplus offer
NRI Edition
AP News
Super Movie
Sports
Daily Specials