Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

అలెర్ట్‌: పిడుగులు ఎప్పుడైనా, ఎక్కడైనా పడొచ్చు.. నిరోధించాలంటే ఎలా..?

Review-Meeting-on-E-Pragathi-By-chandrababu
Posted: 6 Days Ago
Views: 264   

పిడుగులు ఎప్పుడైనా, ఎక్కడైనా పడొచ్చు. మరి, వీటిని నిరోధించాలంటే ఎలా..? ప్రజలను అప్రమత్తం చేయాలంటే ఏం చేయాలి..? దీనిపైనే ప్రత్యేక ఆలోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పిడుగులపై ప్రజల్ని అలెర్ట్‌ చేయడానికి అన్ని గ్రామాల్లో సెరైన్లు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. సచివాలయంలో ఈ-ప్రగతిపై రివ్యూ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. పిడుగుపాట్లపై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.

ఏపీలో పిడుగు పాటు నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికి అన్ని పంచాయ‌తీల్లో సైర‌న్‌లు ఏర్పాటు చేయాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పిడుగు ప‌డే ముందు ప్రజలకు హెచ్చరిక సూచికగా ఆయా పంచాయ‌తీల్లో సైర‌న్ మోగించాల‌ని సూచించారు. ఇప్పటికే విశాఖ, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమ‌లు చేస్తున్న విష‌యాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ పంచాయ‌తీలోనూ ఇలాంటివి ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఈ-ప్రగ‌తిపై స‌చివాల‌యంలోని ఆర్టీజీ స్టేట్ సెంట‌ర్‌లో ముఖ్యమంత్రి స‌మీక్ష నిర్వహించారు. పిడుగుపాటు మ‌ర‌ణాల‌ను సాధ్యమైనంతగా త‌గ్గించ‌డానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.  స్కూళ్లు, కాలేజీల దగ్గర పిడుగు నిరోధ‌క సాధ‌నాల‌ను ఏర్పాటు చేయాల‌న్నారు.

ఇక ఈ-ప్రగతి కోర్ ప్లాట్‌ఫాంకు సంబంధించి ఐటీ స‌ల‌హాదారు సత్యనారాయణ ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా వివ‌రించారు.  సీఎం నిర్దేశించిన లక్ష్యాల మేర‌కు ఈ-ప్రగతి ప‌నులు వేగంగా సాగుతున్నాయ‌ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈ-ప్రగతి హెచ్ ఆర్ పాల‌సీని తీసుకురావాల్సిన అవ‌స‌రముంద‌ని ప్రతిపాదించారు. 2012లో నంద‌న్ నీలేఖ‌ని క‌మిటీ నివేదిక ప్రాతిప‌దిక‌గా ఈ-ప్రగ‌తి హెచ్ ఆర్ పాల‌సీ ఉంటుంద‌ని, దీని వ్యయం ఏటా 16 కోట్ల మేర ఉంటుంద‌ని తెలిపారు. దీన్ని ఐదేళ్ల పాటు అమ‌లు చేయాల్సి ఉంటుంద‌న్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ త‌గిన ప్రతిపాదనలు పంపితే మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామ‌నన్నారు. 6.48 కోట్ల వ్యయంతో ఈ-ప్రగ‌తి అకాడ‌మీ ఏర్పాటు చేయాల‌న్న ప్రతిపాదనల పట్లా సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రజాసాధికార సర్వే డాటా భద్రత చాలాముఖ్యమన్నారు చంద్రబాబు.. ఎట్టి పరిస్థితుల్లో డాటా లీకేజ్‌లకు ఆస్కారం ఉండకూడదని అధికారులకు సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆయా శాఖలు ప్రజాసాధికార సర్వే డాటా వాడుకోవాల్సి వస్తున్నందన ఈ సూచనలు చేశారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials