Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

అజ్ఞాతాన్ని వీడిన సోము వీర్రాజు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి లేఖ...

BJP-Leader-Somu-Veerraju-followers-on-warpath
Posted: 6 Days Ago
Views: 234   

ఏపీ బీజేపీలో ముసలం సమసిపోయినట్టేనా..? అజ్ఞాతాన్ని వీడిన సోము వీర్రాజు పార్టీ కార్యాలయానికి రావడం.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ లేఖ రాయడంతో పరిస్థితి మారినట్టే కనిపిస్తోంది. అయితే కన్నాకు సోము వీర్రాజు ఎంత వరకు సహకరిస్తారన్నది సందేహాలు కలిగిస్తోంది.. ఇంతకూ పార్టీలో సోము వీర్రాజు అసంతృప్తి ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్‌ పడ్డట్టేనా..?

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి కన్నా లక్ష్మీనారాయణను అధిష్టానం ఎంపిక చేయడంతో రగిలిన అసంతృప్త జ్వాల చివరకు చల్లబడింది. అనూహ్య పరిణామాల తర్వాత సోమువీర్రాజు ఎట్టకేలకు మెత్తబడ్డారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి లేఖ పంపారు. అధిష్టాన నిర్ణయాన్ని శిరసావహిస్తామని లేఖలో స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి కార్యకర్తలంతా పార్టీని బలోపేతం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై అంతకు ముందు పెద్ద హైడ్రామానే నడిచింది. మొదటి నుంచి సోము వీర్రాజుకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగినా, చివరి నిమిషంలో సీన్‌ రివర్స్‌ అయింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో సోము వీర్రాజు తీవ్ర నిరాశకు గురయ్యారు.. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేరు. అటు అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్న సోము వీర్రాజు వర్గం రాజీనామాలకు సైతం సిద్ధమైంది.

కన్నాతో వ్యక్తిగతంగా ఎవరికీ విభేదాలు లేకపోయినా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చిన వారికి పదవి ఇవ్వటం సరికాదనే అభిప్రాయం కమలనాధల్లో ఉంది. అయితే దీనిపై బీజేపీ వాదన భిన్నంగా ఉంది. అన్నింటినీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని అంటోంది. త్వరలోనే అంతా సర్దుకుంటుందని బీజేపీ అధినాయకత్వం చెబుతోంది. పార్టీలో రెండు వర్గాలు లేవని.. ఉన్నదే ఒక పార్టీయేనని జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావు అన్నారు.

అటు కన్నా లక్ష్మినారాయణ కూడా ఈ వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. తాను కుల, మత, వర్గాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు అందర్ని కలుపుకుని ముందుకు వెళ్తామన్నారు.

ఇప్పటికి వివాదం సమసిపోయినా, మళ్లీ గ్రూపుల గోల తలెత్తే ప్రమాదం లేకపోలేదని కమలనాథులు కలవరపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సంఘ్‌ పరివార్‌, కార్యకర్తలు కన్నాతో ఏమేరకు కలిసి పనిచేస్తారన్నది అనుమానంగా కనబడుతోంది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials