Live News Now
  • హెచ్చరిక బోర్డులు లేకుండా బ్రిడ్జి నిర్మాణం..
  • బైక్ పై నుంచి పడిన వ్యక్తి శరీరంలోకి ఇనుపచువ్వలు
  • కన్నడనాట ముగిసిన ఉత్కంఠ రాజకీయం...
  • బుధవారం సీఎంగా కుమారస్వామి ప్రమాణం
  • సవాళ్లను ఎదుర్కొంటా... ఐదేళ్లు పక్కాగా పాలిస్తా.. కుమారస్వామి
  • మంత్రివర్గ కూర్పుపై మథనం.. చక్రం తిప్పేందుకు దేవెగౌడ వ్యూహం..
  • రాజధానిపై విమర్శల వల్లే పెట్టుబడులకు ఎఫెక్ట్... చంద్రబాబు
  • సన్‌రైజర్స్‌పై నైట్‌ రైడర్స్‌ గెలుపు.. ప్లే ఆఫ్‌కు చేరిన కోల్‌కతా జట్టు
  • తెలంగాణ స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త శకం..
  • స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే...
ScrollLogo ఎల్బీనగర్‌ పరిధిలో రోడ్డుప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఒకరు దుర్మరణం ScrollLogo పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ ScrollLogo జూన్ 2న తెలంగాణలో కొత్త పీఆర్సీ.. నివేదిక సమర్పణకు 2 నెలల గడువు ScrollLogo ఉత్తరాఖండ్‌లో భారీగా మంచు తుపాను ScrollLogo బద్రీనాథ్‌లో తెలుగు యాత్రికుల అవస్థలు ScrollLogo సీఎం చంద్రబాబుతో అనిల్ అంబానీ భేటీ ScrollLogo కాంగ్రెస్ లీడర్లను మోడీ బెదిరిస్తున్నారు.. రాష్ట్రపతికి మన్మోహన్ సింగ్ ఫిర్యాదు ScrollLogo బాంబుల మోత.. కర్రలతో కొట్లాట.. బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో హింస ScrollLogo కన్నడ ఎన్నిక ముగియగానే మోత.. మళ్లీ భారీగా పెరిగిన చమురు ధర ScrollLogo రైతుకు పెట్టుబడి సాయం చరిత్రాత్మకం.. దేశమంతా చర్చ జరుగుతుందన్న హరీష్

డబ్బు విషయంలో ఈ 3 పనులు చేస్తున్నారా..?

financial-mistakes-to-avoid-during-investment
Posted: 6 Days Ago
Views: 221   

ఆరోగ్యమే మహా భాగ్యము..కొన్నేళ్ల క్రితం వరకూ ఈ సామెత తెలియని తెలుగువారు ఉండరు..వేగం మన జీవితాల్లోకి తోసుకొచ్చిన తర్వాత ఇలాంటి మంచి మాటలకు చోటు లేకుండాపోయిందనుకోండి.! ఇప్పుడెందుకీ ప్రస్తావన అంటే..ధనం మూలమ్ ఇదం జగత్ అనే మాట కూడా చెప్పుకుంటే మన స్టోరీలోకి వెళ్లిపోవచ్చు..అన్నీ డబ్బుతో చేయకపోయినా..అన్నీ చేయాలంటే మాత్రం డబ్బు కావాల్సిందే. అలా ఎంతో అవసరమైన ధనం సంపాదించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. అలా సంపాదించుకున్న ధనాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మనం నెలల తరబడి..సంవత్సరాల తరబడి కూడబెట్టింది..రోజుల్లో, గంటల్లో ఖర్చయిపోతుంది

మనకి 20,30 సంవత్సరాల వయసులో సంపాదన మొదలు పెట్టామంటే అది చాలా ఉత్సాహాన్నిచ్చే విషయం. ఇంకా రెండు పదుల వయసులోనే ఆర్జన మొదలైందంటే..కుటుంబానికి ఎంతో సాయపడినట్లు. ఇష్టమున్నా..లేకపోయినా, తెలిసినా..తెలియకపోయినా సంపాదన ప్రారంభమైన తర్వాత అది ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. అంతేకానీ ఆర్జించిన ధనం గాల్లోకి కలిసిపోయే పనులు చేయకూడదు. మనకి తెలిసి అలా చేసే మూడు తప్పులను ఇప్పుడు చూద్దాం

1. ఒక తప్పుడు ఆర్ధిక ఉత్పత్తిని కొనుగోలు /అవసరం లేని వస్తువు కొనుగోలు
మనకి అవసరం ఉందా లేదా అనేది అర్ధం చేసుకోకుండా ఒక వస్తువు కొనడం పెద్ద తప్పు. ఇది వస్తువు కావచ్చు..పెట్టుబడి కావచ్చు. ఎందులో మనం పెట్టుబడి పెడుతున్నామో, అందులో రిస్క్ ఎంతో తెలియకుండా కొనడం, ఆ కొనడం వలన నెరవేర్చుకోవాలనే లక్ష్యం తెలియాలి. మన ఆర్ధిక లక్ష్యాలకు పెట్టుబడిని లింక్ చేయకుండా కొనుగోలు చేయడం తప్పు. ఇందులో ఇన్సూరెన్స్, పెట్టుబడి రెండూ  ఇమిడి ఉన్న పాలసీ కొనుగోలు చేయడం ఉదాహరణ. ఇది ఎక్కువ ప్రీమియంతో తక్కువ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అలానే ఒక ఎక్కువ మొత్తం అప్పు..అది కూడా ఎప్పటికప్పుడు విలువ తగ్గిపోయే ఆస్థిపై తీసుకోవడం కూడా ఇందుకు ఉదాహరణ. ఇలాంటి కొనుగోళ్లు మన జేబుకి చిల్లు పెడతాయి. దీనికి విరుగుడు ఒక్కటే అర్జంట్‌గా వాటి నుంచి బైటపడటమే! విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా గుంజాటన పడుతూ వాటిని కొనసాగించడం పెద్ద తప్పు

2.  తప్పుడు వ్యక్తుల నుంచి సలహాలు పొందడం
ఇక్కడ తప్పుడు వ్యక్తులు అంటే వాళ్ల వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం కాదు..వారికి సంబంధం లేని అంశాలపై సలహాలు ఇవ్వడానికి ఉవ్విళ్లూరే వ్యక్తులు అని..అంటే ఒక రైతు దగ్గర నుంచి వైద్యసలహా పొందడం లాంటిది. ఎందుకంటే వ్యవసాయంలో నిష్ణాతుడైన వ్యక్తి..వైద్యానికి సంబంధించిన సలహా తీసుకోవడమనేది. స్నేహితులు, దగ్గరివారు, కుటుంబసభ్యుల నుంచి సలహాలు తీసుకోవచ్చు కానీ..వాటిని పాటించేముందు వాళ్ల నిష్ణాణత, నైపుణ్యం కూడా ఆలోచించాలి
భారతీయులలో 90శాతం మంది ఆర్ధికసేవలకు సంబంధించి( షేర్లు, పాలసీలు, మ్యూచువల్ ఫండ్లు) ఏజెంట్లు ఏం చెప్తే అవి తీసుకుంటారట. ఇక్కడ ఏజెంట్లు తమకి ఏ ఉత్పత్తిలో ఎక్కువ కమిషన్ వస్తే వాటినే రికమండ్ చేయడం చేస్తుంటారట. పరిశోధన చేసిన తర్వాత ఇలా ఎవడో చెప్పాడని తీసుకున్న పాలసీలు షేర్లు, ఫండ్లు తమ ఆర్ధిక స్థితిని బాగుపరచడం అటుంచి ఇంకా దిగజార్చాయని సదరు జనం వాపోతున్నారట

3. అవసరమైన వాటిని వాయిదా వేయడం
ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను వాయిదా వేయడమనేది జీవితంలో మనం చేసే అతి పెద్ద తప్పు. ఇది చాలా ఖరీదైన తప్పుగా ప్రతివారూ తమ జీవితకాలంలోనే తెలుసుకుంటారు. కొనుగోలు ఒక్క రోజు ఆలస్యమైతేనే ప్రీమియం పదిశాతం ఎక్కువ కట్టాల్సిన పాలసీ తీసుకోవాల్సి వస్తుంది.ఎందుకంటే వయసు ప్రాతిపదికన ప్రీమియం లెక్కగడతారు కాబట్టి. అలానే ఒక్క నెల ఆలస్యమైతే ప్రభుత్వం అందించే పథకాలకు అనర్హులు కావచ్చు. ఎవరైతే తక్కువ వయస్సులోనే పొదుపు చేయడం, పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తారో వారికి వచ్చే లాభాలు కూడా అలా ఎక్కువకాలం దక్కుతాయ్. Early bird catches the prey ఈ సామెతకి తిరుగులేదు కదా..!Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials