Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

బురఖా వేసుకుని అమ్మాయితో హాస్టల్‌కి వెళ్లాడు.. తెల్లారి చూసేసరికి

pu-student-entered-girls-hostel-and-committed-suicide
Posted: 31 Days Ago
Views: 12939   

ప్రేమించాలంటే ధైర్యం అవసరంలేదు. ఎన్ని జిమ్మిక్కులు చేసైనా అమ్మాయి లేదా అబ్బాయిని వలలో పడేస్తారు. వారి కోసం ఎలాంటి సాహసం చేయడానికైనా సిద్ధపడతారు. మహబూబ్ నగర్ జిల్లా మద్దూరు మండలం బూనీడు గ్రామానికి చెందిన సద్దాం హుసేన్ పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే యూనివర్శిటీలో చదువుతున్న తోటి విద్యార్థినితో కలిసి ఆమె ఉండే హాస్టల్‌కి బురఖా వేసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న సిబ్బందికి ఎటువంటి అనుమానం రాలేదు. వారిరువురు హాస్టల్ గదిలోకి వెళ్లిన తరువాత పక్క రూముల్లోని విద్యార్థినులకు విషయం తెలిసి వార్డెన్‌కు సమాచారం అందించారు. వార్డెన్ వచ్చి సద్దాంని మందలించి పర్మిషన్ లేకుండా లేడీస్ హాస్టల్‌కి వచ్చినందుకుగాను పనిష్‌మెంట్ ఇవ్వదలిచారు. సద్దాం వద్ద ఉన్న సెల్ ‌ఫోన్ తీసుకుని మర్నాడు ఉదయం వచ్చి తీసుకు వెళ్లమని చెప్పారు. మరోసారి ఇలాంటి పొరపాటు పని చేయనంటూ అతడి చేత లేఖ రాయించుకుని మరీ బయటకు పంపించారు. 

హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లాడే కానీ తెల్లారితే ఏమవుతుందో అని భయపడ్డాడు. పరువు పోతుందని ఆలోచించాడు. బతకడానికి ఏ మాత్రం ధైర్యం చాల్లేదు. ఈ ఆలోచనలతోనే నడుచుకుంటూ రైలు పట్టాల మీదకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం మహబూబ్ నగర్ శివార్లలో మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు పత్రికలకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి కొడుకు సద్దాం మృతదేహాన్ని గుర్తించారు. కుమారుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని హాస్టల్ సిబ్బందిని విచారించగా వారు ఏ మాత్రం స్పందించలేదు. ఈ మేరకు సమగ్ర దర్యాప్తు జరపాలని సద్దాం తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు. ఈ సంఘటనపై విచారణకు కమిటీ వేస్తామని సద్దాం చదువుతున్న యూనివర్శిటీ వీసీ రాజారత్నం తెలిపారు. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials