Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ప్లే ఆఫ్స్‌కు అదిరిపోయే ఆరంభం.. థ్రిల్లర్‌ మ్యాచ్‌లో చెన్నైని గెలిపించింది ఆయనే...

ipl-2018-qualifier-1
Posted: 27 Days Ago
Views: 896   

చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. ఉత్కంఠభరితంగా సాగిన స్కోరింగ్ థ్రిల్లర్‌లో డుప్లెసిస్‌ చెన్నైని గెలిపించాడు. మరోసారి బౌలింగ్‌ బలంతో గెలుద్దామనుకున్న సన్‌రైజర్స్ చివర్లో చేతులెత్తేసింది. దీంతో ఏడోసారి ధోనీసేన ఫైనల్‌కు చేరగా... హైదరాబాద్‌కు మరో అవకాశం మిగిలే ఉంది.

ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. రెండు టాప్ టీమ్స్‌ తలపడితే మ్యాచ్ ఎంతటి ఉత్కంఠభరితంగా సాగుతుందో మరోసారి రుజువైంది. వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయిర్ అనూహ్య మలుపులు తిరుగుతూ అభిమానులను అలరించింది. లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో విజయం ఇరు జట్లనూ ఊరిస్తే... చివరికి డుప్లెసిస్ మెరుపుతో చెన్నై ఏడోసారి ఫైనల్‌కు దూసుకెళ్ళింది.

బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందనుకున్న వాంఖేడే పిచ్‌పై బౌలర్లదే పై చేయిగా నిలిచింది. తొలి బంతికే ధావన్ డకౌట్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్‌రైజర్స్‌ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌తో పాటు మిగిలిన బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అయితే విండీస్ ఆల్‌రౌండర్ బ్రత్‌వెయిట్‌ మెరుపులతో సన్‌రైజర్స్ 140 పరుగుల టార్గెట్‌ను చెన్నై ముందు ఉంచగలిగింది. 

ఇదే పిచ్‌పై లో స్కోరింగ్ మ్యాచ్‌ను కాపాడుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు మరోసారి అదరగొట్టారు. చెన్నై స్టార్ ప్లేయర్స్‌ వాట్సన్‌, రాయుడు, ధోనీ, రైనా త్వరగానే ఔటయ్యారు. లోయర్ ఆర్డర్ కూడా నిరాశపరచడంతో సన్‌రైజర్స్ గెలుపు ఖాయంగా కనిపించింది. అయితే చివరి వరకూ ఒంటరి పోరాటం చేసిన డుప్లెసిస్ భారీ షాట్లతో మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. చివర్లో ఠాకూర్ కూడా ధాటిగా ఆడడంతో చెన్నై 2 వికెట్లతో విజయం సాధించింది.

కాగా ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ ఓడిపోయింది. ఇవాళ రాజస్థాన్‌,కోల్‌కతా మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో సన్‌రైజర్స్ రెండో క్వాలిఫైయిర్‌లో తలపడుతుంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials