Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

వీడియోలు చూసి ... మైనర్ బాలికపై ఐదుగురు కలిసి

five-minor-boys-raped-on-minor-girl
Posted: 26 Days Ago
Views: 1516   

సోషల్ మీడియా ఎంత ప్రభావవంతమైందో.. అంతే స్థాయిలో అసత్య ప్రచారాలకు వేదికగా నిలుస్తోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియా అడ్డాగా చాలా నేరాలు జరుగుతున్నాయి. మైనర్లు కూడా చాలా ప్రభావితమై తప్పుదారి పడుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులోనూ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియాలో రేప్ ఘటనలు, ఇలాంటి దృశ్యాలు చూసిన మైనర్లు మరో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని అత్యాచారం చేశారు.

ముందుగా ఒకరు బాలికను లోబరుచుకున్నాడు. అంతటితో ఆగక... అతడి నలుగురు స్నేహితులకూ విషయం చెప్పాడు. వారు కూడా అమ్మాయిని బెదిరించి ఎవరికీ చెప్పొద్దని భయపెట్టి 3 నెలలుగా ఈ ఐదుగురు అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టుతూనే ఉన్నారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రాత్రి ఐదుగురిని అదుపులోకి తీసుకుని బాలికను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అదుపులోకి తీసుకున్న నిందితులను అరెస్ట్ చేయకుండా తమకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. స్టేషన్ ఆవరణలో చాలా సేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా వాగ్వాదానికి దిగారు. అయితే మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇలాంటి ఘటనలన్నిటికీ సోషల్ మీడియా కేంద్రబిందువు అవుతోంది. యువతరం దారి తప్పడానికి కారణమవుతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, స్కూల్ పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చేస్తుండడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials