Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఏపీలో ఉపఎన్నికలకు టీడీపీ రెడీ.. అభ్యర్థులు వీరే?

by-elections-in-andhraparadesh
Posted: 25 Days Ago
Views: 7737   

వైసీపీ ఎంపీలకు స్పీకర్ పిలుపు రావడంతో ఏపీ రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా పెరిగింది. వాళ్ల రాజీనామాలు ఆమోదం పొందితే.. వాట్‌ నెక్స్‌ట్‌ అనేది ఆసక్తి రేపుతోంది. సాధారణ ఎన్నికలకు గట్టిగా ఏడాది సమయం కూడా లేనందున బైపోల్స్‌ రాకపోవచ్చని కొందరి అభిప్రాయం. అయితే.. ఎన్నికల ఏడాదిలో ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్నది టీడీపీ వ్యూహం. ఆ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక‌లు వ‌స్తే పోటీకి సిద్ధమని తేల్చిచెప్పారు చంద్రబాబు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ముళ్లకు స్పష్టంచేశారాయన.

నంద్యాల, కాకినాడ ఫ‌లితాల‌ జోష్‌తో ఐదు ఎంపీ సీట్లు దక్కించుకుంటామని టీడీపీ ధీమా. బైపోల్స్‌లో గెలిస్తే ఆ ఫలితాల ప్రభావం 2019 ఎన్నిక‌లపైనా పడుతుందని చంద్రబాబు అంచ‌నా. గెలుపు వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఐదు నియోజకవర్గాల్లో రెండు గత ఎన్నికల్లో బీజేపీకి వదిలేయగా.. ఇప్పుడు అన్నిచోట్లా ఒంటరిగా పోటీ చేయాల్సిన పరిస్థితి. తిరుప‌తి స్థానాన్ని కమలానికి వదిలేయగా.. జయరామ్‌ పోటీ చేసి ఓడారు. ఇప్పుడాయన టీడీపీలో ఉన్నారు. రాజంపేట నుండి బీజేపీ నాయకురాలు పురంధేశ్వ‌రి పోటీ చేసి ఓడారు. మిగ‌తా మూడుచోట్ల టీడీపీ అభ్యర్థులు ఓటమిచెందారు.

ఉపఎన్నిక‌లే అనివార్యమైతే.. ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై టీడీపీలో స్పష్టతలేదు. కానీ.. కొన్ని పేర్లు మాత్రం పరిశీలనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఒంగోలు పార్ల‌మెంట్ స్థానానికి ఎమ్మెల్సీ మాగుంట శ్రీ‌నివాసుల రెడ్డి పోటీ చేయాల్సి రావ‌చ్చు. నెల్లూరు నుంచి ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీద మ‌స్తాన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. దీన్ని ముందే గ్ర‌హించిన ఆదాల.. తన అయిష్టతను మినీ మహానాడు వేదికగా బయటపెట్టారు. నెల్లూరు పార్ల‌మెంట్ సీటుకు బైపోల్ వస్తే.. జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి, నారాయ‌ణ‌లో ఒక‌రు బరిలోకి దిగాలని అన్నారాయన.

తిరుప‌తి పార్ల‌మెంట్ స్థానానికి వ‌ర్ల రామ‌య్య పేరు తెర‌పైకి రావ‌చ్చని తెలుస్తోంది. 2009లో అక్కడి నుంచి పోటీచేసిన ఆయన 10వేల ఓట్ల‌ తేడాతో ఓడిపోయారు. 2014లో బీజేపీకి చెందిన జ‌య‌రామ్ పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆయన టీడీపీలో చేరినప్పటికీ.. వ‌ర్లను పోటీకి నిలిపే అవకాశాలే ఎక్కవని తెలుస్తోంది. క‌డ‌ప పార్ల‌మెంట్ విషయానికివస్తే.. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీ‌నివాసులు రెడ్డి రెఢీ అంటున్నారు. పార్టీ ఆయన్ని వద్దనుకుంటే.. మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డిలో ఒక‌రు అభ్య‌ర్థి కావ‌చ్చు. ఆది, పిఆర్‌లో ఒక‌రిని పార్ల‌మెంట్‌కు, మరొకర్ని అసెంబ్లీకి పెడితే తలనొప్పులు ఉండవని లెక్కలు వేస్తున్నారు. ఇక, రాజంపేట పార్ల‌మెంట్ నియోజకవర్గం నుండి... మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు కిషోర్ రెడ్డి లేదంటే ఆయ‌న త‌న‌యుడు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం. ఈమధ్యే సైకిలెక్కిన కిషోర్‌ కుమార్‌ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఆయన్ని పార్లమెంట్ బరిలోను నిలబెట్టవచ్చనీ చెప్తున్నారు.

ఐదు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక‌లే వ‌స్తే టీడీపీ, వైసీపీలకు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్యే. ఎందుకంటే బైపోల్ రిజల్ట్‌ 2019 సాధార‌ణ ఎన్నిక‌ల‌పై తప్పకుండా పడుతుంది. అందుకే.. రెండు పార్టీలు ప్రి-ఫైనల్స్‌గా భావించి హోరాహోరీ తలపడే సూచనలు కనిపిస్తున్నాయి.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials