Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం

telangana-govt-employees-happy-news
Posted: 25 Days Ago
Views: 1862   

తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ బదిలీలు ప్రారంభమయ్యాయి. జూన్‌ 15 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రెండుళ్లు పూర్తి చేసుకున్నవారంతా బదిలీకి అర్హులే. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారంతా కొత్త ప్రాంతానికి వెళ్లాల్సిందే. అయితే ఒకేచోటికి బదిలీకి దరఖాస్తు చేసుకునే భార్యాభర్తలు, జిల్లాల్లో ఆర్డర్‌ టు సర్వ్‌పై పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ రూల్  వర్తించదు. ఈ నెల 31తో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు బదిలీ నుండి మినహాయింపు ఇచ్చారు. పరిపాలన కుంటుబడకుండా  ఏ స్థాయి కేడర్‌లోనైనా 40 శాతానికి మించి బదిలీలు జరపరాదనే నిబంధన 

ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు, లెక్చరర్ల బదిలీలకు మార్గదర్శకాలు రూపొందించుకుంటోంది విద్యాశాఖ. ఉద్యోగులు తమ ఆప్షన్లను ఇవ్వడానికి ముందుగానే క్లియర్ వెకెన్సీల జాబితాను ప్రకటించనుంది. ట్రాన్స్‌ఫర్ కోరుకొంటున్న ఉద్యోగుల జాబితాలను కూడా ప్రకటిస్తారు. ప్రతి శాఖలో ఉండాల్సిన క్యాడర్ స్ట్రెంత్, పనిచేయాల్సిన ఉద్యోగుల సంఖ్య, వెనుకబడిన ప్రాంతాల్లో అవసరాలపై తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఆదాయ వనరులు కలిగిన వాణిజ్య పన్నులు, ఆబ్కారీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అటవీ, రవాణా శాఖలు తమ పరిపాలనా పరిస్థితులకు అనుగుణంగా బదిలీల మార్గదర్శకాలను రూపొందించుకుంటున్నాయి. 

బదిలీలతో పాటు టీచర్ల  ప్రమోషన్ల పైనా సర్కార్‌ సీరియస్ గా ఫోకస్ చేసింది. పదోన్నతులకు ప్రతిబంధకంగా ఉన్న ఏకీకృత సర్వీస్‌రూల్స్‌ను సాధించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రాథమికంగా నిర్ణయించింది. హైకోర్టులో కేసుకు పరిష్కారం లభించడానికి ముందే ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. వీరికి పదోన్నతులు కల్పించడం వల్ల ఎంతమందికి ప్రయోజనం, న్యాయపరమైన సమస్యలపై జూన్ 1 వరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘ నేతలకు డిప్యూటీ సీఎం కడియం ఇప్పటికే  కోరారు. 

ఇక ముఖ్యమంత్రి ఖరారు చేసిన కొత్త జోన్ల ప్రతిపాదనలపై ఉద్యోగ సంఘాలు సుదీర్ఘంగా చర్చించి సీఎస్‌కు నివేదికిచ్చాయి. ఏడు జోన్లపై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే ప‌లు సూచ‌న‌లు చేశాయి. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో, జ‌న‌గాంను భ‌ద్రాద్రి జోన్‌లో క‌ల‌పాల‌ని సూచించాయి. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దివిన వారిని లోక‌ల్ గా గుర్తించాల‌ని ప్రభుత్వాన్ని కోరారు. స్టేట్ క్యాడ‌ర్  పోస్టులకు ప్రమోష‌న్లు వ‌చ్చేలా చూడాల‌ని ఉద్యోగ సంఘాలు కోరాయి.  మొత్తానికి సుదీర్ఘ కాలం తర్వాత  ప్రభుత్వం బదిలీలు చేపడుతుండటంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ బదిలీల సందడి కనిపిస్తోంది.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials