Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మక పథకం

Telangana-govt-will-taken-another-prestigious-scheme
Posted: 25 Days Ago
Views: 4958   

తెలంగాణ సర్కార్ మరో ప్రతిష్టాత్మక పథకాన్ని పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే పెట్టుబడి సాయంగా ఏడాదికి ఎకరాకు 8 వేల రూపాయలు అందిస్తున్న ప్రభుత్వం.. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తోంది. రైతు బీమా విధివిధానాలపై మంత్రులు, అధికారులతో, ఎల్ఐసీ అధికారులతో చర్చించి ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. ఈ ఏడాది ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభించి, సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేకుండా, ఎంత వ్యయమైనా సరే ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. 

రైతు ఏ విధంగా మరణించినా, ఆయన ప్రతిపాదించిన నామినీకి పది రోజుల్లోగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెల్లించేలా పథకం ఉండనుంది. ఇంతపెద్ద మొత్తంలో జీవితబీమా చేస్తున్నందున ఎల్ఐసి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా అమలు చేయాలని కేసీఆర్‌ కోరారు. బీమా నిబంధనల ప్రకారం 18 నుంచి 60 ఏండ్ల వరకు వయస్సున్న వారికే వర్తిస్తుంది. దీనిప్రకారం 59 ఏండ్లలోపు వారిని మాత్రమే బీమా పథకానికి నమోదు చేసుకుంటారు. ఆధార్ కార్డుపై నమోదైన పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రతీ ఏడాది కూడా ఆగస్టు 15నే ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేసుకుంటారు. రైతు మరణించిన పది రోజుల్లోగానే 5 లక్షల రూపాయలను నామినీకి అందచేస్తారు. రైతు కుటుంబ సభ్యులు కేవలం మరణ దృవీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుంది. పదిరోజుల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్ఐసికి జరిమానా విధిస్తారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials