Live News Now
  • గోదారిలో గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • కేంద్రంపై ఆవిశ్వాసానికి టీడీపీ పావులు.. టీఆర్ఎస్ మద్దతు కోసం కేకేను కలిసిన ఎంపీలు
  • టీఆర్‌ఎస్ లో ఎంత మంది చేరినా నో ప్రాబ్లమ్.. పార్టీని పుష్పక విమానంతో పోల్చిన కవిత
  • వైభవంగా గొల్కొండ బోనాలు.. మొక్కులు చెల్లించేందుకు బారులు తీరిన భక్తులు
  • సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం విషం తాగినట్లే.. సంతృప్తిగా లేనని కంటతడి పెట్టిన కన్నడ సీఎం
  • కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ సన్నాహాలు..
  • ఆర్టీసీ కార్మికులకు 19శాతం మధ్యంతర భృతి.. 240కోట్ల భారం పడుతుందన్న ఏపీ సర్కార్
  • 20 గంటలు గడిచిన లభించని ఆచూకీ.. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
  • సిరిసిల్లలో పల్టీలు కొట్టిన ఆటో.. 11మందికి ప్రయాణికులకు గాయాలు
  • కాంగ్రెస్ సాగునీటి రంగాన్ని గాలికొదిలేసింది.. మీర్జాపూర్‌ సభలో నిప్పులు చెరిగిన మోడీ
ScrollLogo పార్లమెంట్ సెష‌న్‌పై నేడు టీడీపీ వ్యూహరచన ScrollLogo పోల‌వ‌రానికి అండ‌గా ఉంటామన్న గడ్కరీ.. చంద్రబాబు పట్టుదలపై ప్రశంసలు జల్లు ScrollLogo స్థానిక ఎన్నిక‌ల్లో బీసీ కోటా తగ్గదు.. ఎన్నికలంటే భయం లేదన్న ఈటెల ScrollLogo న‌గ‌ర బహిష్కరణపై ప‌రిపూర్ణానంద న్యాయ‌పోరాటం ScrollLogo ప‌రిపూర్ణానంద స్వామీజీకి మద్దతుగా వెల్లువెత్తిన నిర‌స‌న‌లు ScrollLogo రాష్ట్రానికి చేరుకున్న శ‌ర‌త్ మృత‌దేహం.. నేడు వ‌రంగ‌ల్‌లో అంత్యక్రియలు ScrollLogo నైరుతి జోరుతో కుండపోత వర్షాలు ScrollLogo తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ ScrollLogo నంబ‌ర్‌వ‌న్ ర్యాంక్‌పై క‌న్నేసిన టీమిండియా ScrollLogo నేటి నుంచి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌

హెచ్చరిక.. మరో రెండ్రోజులపాటు భారీవర్షాలు.. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో..

weather-report-Heavy-rains-in-Telugu-states
Posted: 10 Days Ago
Views: 692   

జోరువానలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో రెండ్రోజులపాటు భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి..వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం ప్రభావం తీవ్రంగా ఉండటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. 
ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టిన్నంపాలెం వద్ద జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది . ఏజెన్సీలోని 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

తెలంగాణలోనూ కుంభవృష్టి కురుస్తోంది.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి.పలిమేల మండలంలోని పంకేన,తీగలవాగు, సర్వాయిపేట వాగు  ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 13 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు వస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారంలో వాగు ఉధృతికి అప్రోచ్‌ రోడ్డు తెగిపోయింది. దీంతో నిర్మల్‌-మంచిర్యాల జిల్లా కేంద్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. 10వేలా 700 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 8 వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు వదులుతున్నారు. అటు దిగువన వున్న గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. దీంతో పర్యాటకులు క్యూ కడుతున్నారు. ప్రాజెక్టు అందాలను ఆస్వాదిస్తున్నారు. 

కాళేశ్వరం దగ్గర గోదావరి ప్రవాహం పుష్కర ఘాట్‌ మెట్లను తాకింది. భద్రాచలం వద్ద ప్రవాహం 16అడుగులకు చేరింది. భారీ వర్షాలు, గోదావరి వరదతో కాళేశ్వరం, అన్నారం బ్యారేజి పనులు నిలిచిపోయాయి.. అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు మంత్రి హరీష్ ఆదేశించారు. 

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రులంతా జిల్లాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక హైదరాబాద్‌లోనూ వర్షం పడుతోంది.. మూడ్రోజులుగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆఫీస్‌లకు వెళ్లే టైమ్‌లో.. ఇళ్లకు వెళ్లే సమయాల్లో వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు కడలి ఇంకా కల్లోలంగానే కనబడుతోంది. తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తీర ప్రాంతంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశాఖ, కళింగపట్నం, బారువా తీర ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల మేర ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials