Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

ఏపీని, నమ్ముకున్న ప్రజల్ని మోసం చేయడంలో పోటీ పడుతున్న జాతీయ పార్టీలు!

top-story
Posted: 130 Days Ago
Views: 839   

తెలంగాణ రాష్ట్ర నినాదం దశాబ్ధాలుగా నలిగింది. 1969లో జరిగిన ఉద్యమాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే అణిచివేసింది. మలిదశ ఉద్యమం తారాస్థాయికి చేరినప్పుడు 2004లో యూపీఏ-1 కనీస ఉమ్మడి ప్రణాళికలో చేర్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలోనూ చేర్చింది. యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇతర పార్టీలపై నెపం నెట్టి రాజకీయంగా పబ్బం గడిపింది. 2014 ఎన్నికలకు ముందు మరోసారి అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్.. తెలంగాణలో లబ్ధిపొందాలనుకుని రాజకీయ సమీకరణాల లెక్కలేసుకుని రాష్ట్ర విభజన ప్రకటించింది. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పెట్టినప్పుడు కూడా తన ప్రయోజనాలు చూసుకుంది కానీ.. భవిష్యత్తులో వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేసింది. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ముందుగానే పంపకాలు చేసి.. స్పష్టమైన హామీలు, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుపై భరోసా ఇచ్చి ఉంటే ఇప్పుడీ సమస్యలు వచ్చేవి కావు. అప్రజాస్వామికంగా పార్లమెంట్ తలుపులు వేసి, టీవీలు కట్టేసి రాష్ట్రాన్ని విభజించారని ఇప్పడు ప్రధాని మోడీ అంటున్నారు. విభజన బిల్లుకు మద్దతు ఇస్తే తెలంగాణలో బలపడొచ్చన్న రహస్య ఎజెండాతో మౌనంగా ఉన్నది బీజేపీ కాదా? ఆనాడు మద్దతిచ్చి పాపంలో భాగం పంచుకోలేదా? తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ.. ఇప్పుడు మాత్రం చేసిన న్యాయం ఏంటి?  తల్లికి మళ్లీ ప్రాణం పోసే అవకాశం ఉన్నా.. అంపశయ్యపై వదిలేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్న తప్పు కాదా? నాడు కాంగ్రెస్ చేసింది పాపం అయితే.. ఆదుకుంటామని హామీ ఇచ్చి మాట తప్పడం మోసం కాదా? ఏపీని, నమ్ముకున్న ప్రజల్ని మోసం చేయడంలో జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. కొత్తగా హామీలు అడగడం లేదు.. నాడు బిల్లులో పెట్టిన అంశాలనే అమలు చేయాలంటున్నారు. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, స్టీలు పరిశ్రమ, దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్ మాత్రమే అడుగుతున్నారు. అయినా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్యాకేజీ పేరుతో నిలువునా మోసం చేశారు. న్యాయం చేయమని పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తే.. మోడీ చరిత్ర పాఠాలు చెప్పారు. అరుణ్ జైట్లీ పాతపాటే పాడి మరింత ఆగ్రహాన్నితెప్పిస్తున్నారు. జనాలు రోడ్డుమీదకు వచ్చి ప్రశ్నిస్తున్నా తప్పించుకుంటోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు అడగకపోయినా వరాలు ఇస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హక్కులను పట్టించుకోవడం లేదు. ఇంకా హామీలపై నాన్చి.. రాష్ట్రంలో అశాంతిని రాజేయాలనుకుంటున్నారా? ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడకాలని కేంద్రం కోరుకుంటోందా? అశాంతి నుంచి ఓట్లు ఏరుకోవాలని చూసే నీచస్థితి రాజకీయాలు చేయాలనుకుంటుంది ఎవరు? కారణం ఏదైనా కాశ్మీర్ రావణకాష్టంలా మండుతూనే ఉంది. ఒకనాడు ఖలిస్తాన్ ఉద్యమం ప్రధానిని బలితీసుకుంది. తమిళ ఈలం మరో మాజీ ప్రధాని ప్రాణాలు తీసుకుంది. ఇవన్నీ ఆగ్రహం నుంచి, ఆశాంతి నుంచి పుట్టినవే? తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ఉద్యమాలు రాకపోవచ్చు.. అంతటి ఆలోచనలు చేయలేకపోవచ్చు. కానీ ప్రజాగ్రహం వెల్లువెత్తితే జరిగే నష్టం ఊహించడం కష్టమే. మరి కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇప్పటికైనా జనాలు కోరుకుంటున్న డిమాండ్లను నెరవేర్చలేరా? హామీలను అమలుచేసి ఏపీకి సానుకూల సంకేతాలు పంపలేరా? 25లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్రం... ఇచ్చిన హామీ కోసం కేటాయింపులు ఎందుకు చేయలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials