Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

'అ' మూవీ రివ్యూ

AWE-Movie-Review
Posted: 123 Days Ago
Views: 1597   

కథ:
ఒక రెస్టారెంట్ అందులోకి కొన్ని పాత్రలు వస్తుంటాయి. రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు కలిగిన మనుషులు రాధ ( ఈషా రెబ్బ ), క్రిష్ (నిత్యా మీనన్) లు పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.  శివ (శ్రీనివాస్ అవసరాల) టైం మిషన్ చేయాలని ప్రయత్నిస్తుంటాడు.  మీర (రెజినా) తను పనిచేసే రెస్టారెంట్ లో ఒక క్రైమ్ కి సహాకరిస్తుంటుంది.   నలభీమ (ప్రియదర్శి) చెఫ్ గా  అందరూ ఎవరి వ్యక్తిగత సమస్యలతో వాళ్ళు బిజీగా, సతమవుతూ ఉంటారు. వాళ్ళ మధ్యలో కాలి (కాజల్ అగర్వాల్) అనే అమ్మాయి అందరికన్నా తీవ్రమైన సమస్యతో బాధపడుతూ, విముక్తి కోసం మాస్ మర్డర్స్ చేయాలనుకుంటుంది. వీరంతా ఒకే రెస్టారెంట్ లో అపరిచితుల్లా ఎవరి సమస్యలో ఉంటారు. కానీ వీరిని కనెక్ట్ చేసే పాయింట్ ఒకటుంది ఏంటది అనేది ‘అ’ కథ...?

కథనం:
‘అ’ కి ప్రధాన బలం సినిమాటోగ్రఫీ.. ఒక చోటనే సినిమా అంతా జరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా చేయగలిగాడు కార్తిక్ ఘట్టమనేని. కథలోకి ఎంటరయిన ప్రతి పాత్రా కూడా ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఇషా, నిత్యా మీనన్ లు ప్రేమలో ఉండటం ఒక షాకింగ్ పాయింట్ అయితే టైం తో ట్రావెల్ అవ్వాలని శ్రీనివాస్ అవసరాల చేసే ప్రయత్నాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ఇకమురళీశర్మ, రెజీనా పాత్రలు మిస్టీరియస్ గా ఉంటూ ఉత్కంఠతను కలిగించాయి. ఇక కాజల్ పాత్ర చుట్టూ అల్లుకున్నచీకటి ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుంది. ప్రియదర్శిని రామ్ పాత్ర చుట్టూ మాటలు రూపంలో నాని, రవితేజ చేసే అల్లరి బాగా ఆహ్లాదకరంగా ఉంది. పాత్రల పరిచయాలు బాగానే ఉన్నా కానీ వాటి కథలలో సమస్యను ఎస్టాబ్లిష్ చేయడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా అవసరాల శ్రీనివాస రావు పాత్ర చెప్పే ప్రతి మాటా అతనికి చుట్టూ జరిగే సంఘటలనలు చాలా తికమకగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తిక్క తిక్క గా ఉంటాయి. ఆ తిక్క పక్కన పెడితే మురళీశర్మ పాత్రలోకి వచ్చే సన్నివేశాలతో ‘అ’ సినిమా ఏంటి..? సస్పెన్సా, ఫిక్షనా, హార్రరా అనే సందేహాలను కలిగిస్తుంది. ఇక రెజీనా పాత్ర ను ఇంట్రెస్టింగ్ డిజైన్ చేసినా ఆ పాత్రలో కూడా చాలా గందరగోళం సృష్టించాడు. అసలు కథే గందరగోళంగా ఉంటే.. వచ్చే ఉపకథలు ప్రేక్షకుల సహానానికి పరీక్ష పెట్టాయి. పోనీ జరిగే సన్నివేశాలతో ఎంగేజ్ అవుదామనుకున్నా పనిచేస్తున్న మెదడు సంధించే ప్రశ్నలు ప్రేక్షకుల్ని సీట్లలో కూర్చోనివ్వవు.  ఆర్టిస్ట్ ల పరంగా తమ పాత్రలకు అందరూ న్యాయం చేశారు. నిజం చెప్పాలంటే వారి ఇమేజ్ లు ఆ పాత్రలను కాస్త భరించగలిగే శక్తిని ఇచ్చాయి. కాజల్ పాత్రను ప్రధానంగా అనుకున్నప్పుడు ఆ పాత్రను సరిగ్గా ఏస్టాబ్లష్ చేయలేదు.. దర్శకుడు. ఆమెకు తల్లిదండ్రులున్నారా లేరా..? ఆమె చనిపోవవడానికి కారణం కూడా బలంగా చూపించలేకపోయాడు. గుండె వీక్ గా ,  బాడీ బలంగా ఉన్న మనిషి  కనిపిస్తే  జాలిపడతాం.. అయ్యో పాపం అనుకుంటాం.. ‘ అ’ విషయంలో కూడా అదే జరిగింది. నాని మంచి ప్రయత్నానికి  సపోర్ట్ గా మారాడు. కొత్త కథనంతో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలనుకున్నాడు. కానీ ప్రశాంత్ వర్మ తెరమీదకు తెచ్చింది సగం కథేమో అనిపిస్తుంది.  ఈ మొత్తం అయో మయంలో చేపగా నాని, చెట్టుగా రవితేజ పెద్ద రిలీఫ్ నిచ్చారు.. లేకపోతే ‘అ’ ఊపిరాడనిచ్చేది కాదు.

చివరిగా:
అ: అయోమయం తో నిండిన అసందర్భమైన ఆలోచనలను రూపం. అమ్మో .. భరించడం కష్టం


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials