Live News Now
  • కేంద్రంపై దళిత-గిరిజనుల ఐక్య గర్జన.. వరంగల్‌ వేదికగా విపక్షాల పోరుబాట
  • ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ భారత్‌ సొంతం.. ఫైనల్‌లో కెన్యాపై 2-0 తేడాతో విజయం
  • 6 నెలలు.. 13 జిల్లాలు.. 75 సమావేశాలు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న బాబు
  • ఏపీలో టిడిపి, బీజేపీ మధ్య ముదిరిన వార్
  • ప్రధానికి కన్నా ఇచ్చిన లేఖపై లోకేష్ ఫైర్
  • ప్యాకేజీల వారీగా అధికారులకు డెడ్ లైన్.. హరీష్ డైరెక్షన్‌లో వేగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్
  • మరో రెండు రోజులు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు
  • గోదావరి ప్రాజెక్టులకు మొదలైన వరదలు
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్ని కేసులు వేసినా భయపడను.. విమర్శలపై వెనక్కి తగ్గేది లేదన్న రాహుల్
  • శత్రువుల్లా వచ్చి.. మిత్రులైన ట్రంప్, కిమ్.. అణు నిరాయుధీకరణపై కుదిరిన డీల్
ScrollLogo తొమ్మిదో తరగతి విద్యార్థి సూసైడ్ ScrollLogo రూపాయి ఖర్చు లేకుండా 53 రకాల వైద్య పరీక్షలు ScrollLogo నిరుద్యోగులకు శుభవార్త..10,351 ఉద్యోగాల భర్తీకి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ScrollLogo జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ScrollLogo తిరుమలలో భారీ వర్షం ScrollLogo వ్యర్థాల ఉత్పత్తిలో ముంబై ఫస్ట్! ScrollLogo సీఐ వాహనం చోరీ ScrollLogo యన్‌టీఆర్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల ScrollLogo నేడు పోలవరం పర్యటనకు సీఎం.. డయాఫ్రమ్‌ వాల్‌ జాతికి అంకితం ScrollLogo రాజమండ్రి ఎంపీ సీటుపై జగన్‌ వ్యూహం.. ఆత్మీయ సభలో బీసీలపై హామీల వర్షం

రివ్యూ: తెలుగు సినిమా కథలకు కొత్త దారి చూపించిన రంగస్థలం

rangasthalam-review
Posted: 81 Days Ago
Views: 11392   

చిత్రం: రంగస్థలం 
నటీనటులు: రామ్‌చరణ్‌.. సమంత.. ఆది.. ప్రకాశ్‌రాజ్‌.. జగపతిబాబు.. అనసూయ.. నరేష్‌.. రోహిణి.. రాజీవ్‌ కనకాల తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు 
కూర్పు: నవీన్‌ నూలి 
కళ: రామకృష్ణ, మౌనిక 
పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌ 
సాహిత్యం: చంద్రబోస్‌ 
రచన: తోట శ్రీనివాస్‌.. కాశీ విశాల్‌.. బుచ్చిబాబు.. శ్రీనివాస్‌ రంగోలి 
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని.. వై. రవిశంకర్‌.. మోహన్‌ చెరుకూరి 
దర్శకత్వం: సుకుమార్‌ 
బ్యానర్‌: మైత్రీ మూవీ మేకర్స్‌ 
విడుదల: 30-03-2018


రంగస్థలం.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో విపరీతంగా డిస్కషన్స్ లో ఉన్న సినిమా. రామ్ చరణ్ లుక్ నుంచి సమంత పాత్ర వరకూ, చంద్రబోస్ సాహిత్యం నుంచి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం వరకూ.. అన్నిటికీ మించి సుకుమార్ దర్శకత్వ ప్రతిభ గురించి రిలీజ్ కు ముందే విపరీతంగా మాట్లాడుకునేలా చేసిన రంగస్థలం ఫైనల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో వచ్చిన రంగస్థలం వాటిని అందుకుందా..? ఇప్పుడు చూద్దాం.. కథ: 
రంగస్థలం అనే ఊరు. కాలం 1980.. రకరకాల వృత్తుల వారు నివసించే ఆ ఊరు గోదారిని ఆనుకుని ఉంటుంది. వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా బ్రతికే కుటుంబాలు చాలానే ఉంటాయి ఈ ఊరిలో. చిట్టిబాబుకు చెవులు సరిగా వినిపించవు. గట్టిగా మాట్లాడితే కానీ అర్థం కాదు. ఆ ఊరి పొలాలకు తన మోటర్ ద్వారా నీరు అందిస్తుంటాడు. తనకి ఏ ఇబ్బంది వచ్చినా రంగమ్మత్తతో చెప్పుకుంటాడు. ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఇదిలా ఉండగా పేరు కూడా ప్రెసిడెంట్ గానే స్థిరపరుచుకుని ముప్ఫైయేళ్లుగా ఆ ఊరి ప్రెసిడెంట్ గా ఉంటాడో వ్యక్తి. సోసైటీతో కుమ్మక్కై నిరక్షరాస్యులైన గ్రామప్రజలను సొసైటీ అప్పు పేరుతో అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటాడు. ఎదురు తిరిగినవారిని రాత్రికి రాత్రే హత్యలు చేస్తుంటాడు. చిట్టిబాబు అన్న కుమార్ బాబు.. కొంతకాలం దుబాయ్ లో ఉండి వస్తాడు. అతనో అమ్మాయిని ప్రేమిస్తాడు. అదే ఊరిలో రామలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు చిట్టిబాబు. ఒకసారి సొసైటీ చేస్తోన్న రచ్చ గురించి బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు కుమార్ బాబు. అతనిదే తప్పని పంచాయితీలో నిరూపించి ఏకంగా 20వేల జరిమానా వేస్తారు. ఆ విషయంపై ప్రశ్నించిన చిట్టిబాబు కుటుంబాన్ని పంచాయితీలో అవమానిస్తారు. అలా అవమానించిన ప్రెసిడెంట్ మనిషిని కొడతాడు చిట్టిబాబు. కేస్ అవుతుంది. బెయిల్ కోసం ప్రయత్నిస్తే ప్రెసిడెంట్ పట్టించుకోడు. పైగా మళ్లీ అవమానిస్తాడు. దీంతో ఎమ్మెల్యే సాయంతో చిట్టిబాబుకు బెయిల్ తెస్తాడు కుమార్ బాబు. ఆ తర్వాత తనే ఆ ఊరి ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తాడు. ఇది సహించని ప్రెసిడెంట్ ఏం చేశాడు. కుమార్ బాబు నామినేషన్ తర్వాత ఆ ఊరి పరిస్థితులు ఎలా మారాయి. కుమార్ బాబు సర్పంచ్ అయ్యాడా..? చిట్టిబాబు ప్రేమకథ ఏమైంది..? ఎమ్మెల్యే, ప్రెసిడెంట్ మధ్య చిట్టిబాబు జీవితం ఏమైందీ అనేది అసలు కథ..
 

కథనం:
రంగస్థలం.. ఓ సాధారణ గ్రామం కథ. కానీ ఆ గ్రామాన్ని ముందుపెట్టి ఒకప్పటి భారతీయ గ్రామీణ ఆర్థికవ్యవస్థను చర్చించాడు సుకుమార్. నిరక్షరాస్యత వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఛిన్నాభిన్నమైందనే విషయంలో కళ్లకు కట్టినట్టు చెప్పాడు. భూస్వామ్య విధానం వల్ల గ్రామం ఏకఛత్రం కింద ఎలా నలిగిపోయిందనే విషయాన్ని హృదయాలకు హత్తుకునేలా చర్చించాడు. వ్యవసాయమే ప్రధానంగా ఉన్న గ్రామీణ ప్రజల్ని సొసైటీ పేరుతో పీడించుకున్న గద్దల్ని గట్టిగా కొట్టినంత పనిచేశాడు. పైకి ఎన్ని ఆశయాలు వల్లెవేసినా.. ఎన్ని గొప్ప మాటలు చెప్పినా.. లోపల కులవ్యవస్థ ఎంత కుళ్లిపోయిన స్థితిలో ఉంటుందనే విషయాన్ని నిర్మొహమాటంగా చిత్రించాడు. కులం తక్కువ వాడు కాళ్లకిందే ఉండాలనే కులతత్వపు నాయకుల మనస్తత్వాల్ని చెళ్లుమనిపించేలా చెప్పాడు. కథగా చెబితే చిన్న పాయింట్ లా కనిపిస్తుంది. కానీ కథనం ప్రతి ఒక్కరినీ హత్తుకుంటుంది. ఇప్పుడు నలభైయేళ్లున్న వారెవరికైనా ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ కాలం నాటి సొసైటీ, ప్రెసిడెంట్ పేరుతో తిష్టవేసుకున్న రాబందుల ఆకృత్యాలు సజీవంగా కదలాడతాయి. ఒకరకంగా ఇది రంగస్థలం కథ కాదు. అన్ని జాఢ్యాలతో కుమిలిపోయిన గ్రామీణ భారత కథ. ఆ కథను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు అని గట్టిగా వినిపిస్తోంది.  కథంటే సజీవంగా ఉండాలి. పాత్రలుగా వెలగాలి. హీరో సెంట్రిక్ గా సాగినా.. కథనం హీరోయిక్ గా ఉండకూడదు. అప్పుడే అది అందరూ మెచ్చే, అందరికీ నచ్చే కథవుతుంది. సుకుమార్ రంగస్థలం ఈ కోవలోకే వచ్చే కథ. ఆ కథను అతను చెప్పిన విధానం చూసి తీరాల్సిందే. మరి ఇంతలా చెప్పుకోవడానికి ఈ కథలో ఏముందీ.. అంటే చాలానే ఉన్నాయి.. ఓ సాధారణ టైలర్. ఇద్దరు కొడుకులు ఓ కూతురు. పెద్దోడు బాగా చదువుకుంటాడు. దుబాయ్ లో పనిచేసి ఊరికి వస్తాడు. రెండోవాడికి చెవులు వినిపించవు. చదువుకోడు. ఊళ్లో తనపనేదో తాను చేస్తూ ఇంటికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్నమ్మాయి చదువుకుంటుంది. ఈ రెండోవాడికి ఊరంతా స్నేహితులే. అందరికీ కావాల్సినవాడు. అలాంటి వాడికి కష్టం వస్తే.. అన్న తప్ప ఎవరూ ముందుకు రారు. అలాంటి ఊరును ఈ అన్న మార్చాలనుకుంటాడు. కానీ అలా మార్చాలనుకున్నవాళ్లంతా చంపివేయబడతారు. కానీ ఇక్కడ ఆ అన్నకు మొనగాడైన తమ్ముడుంటాడు. అదే ఊరి ప్రెసిడెంట్ కు నచ్చదు. ఊరంతా ఈ కుటుంబానికి సాయం చేయకపోతే నియోజకవర్గ ఎమ్మెల్యే సాయంతో ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేస్తాడు కుమార్ బాబు. ప్రెసిడెంట్ కుయుక్తుల నుంచి, అన్నను కాపాడుతూ, తన ప్రేమను కూడా వదులుకోవడానికి సిద్ధపడతాడు చిట్టిబాబు. ఈ క్రమంలో అనూహ్యంగా ఎమ్మెల్యే కు యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత కథే కన్నీళ్లను ఆపుకోలేనంతగా సాగుతుంది. క్లైమాక్స్ తో కులవ్యవస్థపై సుకుమార్ వేసిన సెటైర్ అర్థం చేసుకుంటే కానీ తెలియదు. ఈ సినిమాలో ఉన్న కీలక పాత్రలు కొన్నే. కానీ ప్రతి పాత్రా మనసులో రిజిస్టర్ అవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గురించి చెప్పుకోవాలి. ఈ పాత్రకోసం ఒప్పుకున్నందు కాదు. ఈ పాత్రలో అతను జీవించినందుకు.. చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన ఎంతమందిని ఆశ్చర్యపరుస్తుందో చెప్పలేం. ఆ పాత్రను చరణ్ ఆవాహన చేసుకున్నాడు. ఎన్నో సన్నివేశాల్లో అతని నటనకు ఫిదా అయిపోతాం. ఇతన్లో ఇంత ఆర్టిస్ట్ ఉన్నాడా అనిపించక మానదు. ఆ స్థాయి నటనతో ఖచ్చితంగా తండ్రి గర్వపడే పాత్ర చేశాడు చరణ్. మామూలుగానే ది బెస్ట్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న సమంత ఈ పాత్రకు బిగ్గెస్ట్ అస్సెట్. ఆరో తరగతి వరకూ చదువుకుని, తల్లి చినిపోతే చదువు ఆపేసి పొలం పనులు చేసుకునే యువతిగా ఆమె నటన సింప్లీ సూపర్బ్. చరణ్, సమంతల పాత్రల్లో మరెవరినీ ఊహించుకునే ఆస్కారం ఇవ్వలేదీ ఇద్దరు. ఇద్దరి మధ్య ఫస్ట్ హాఫ్ సీన్స్ చిలిపిగా ఉంటే, సెకండ్ హాఫ్ లో ఎంతో మెచ్యూర్ గా కనిపిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పని ముగించుకుని వచ్చిన చరణ్, సమంతను పదా అని చెప్పే సీన్ లో ఎన్ని భావాలు పలుకుతాయో చెప్పలేం. ఈ రెండు పాత్రల తర్వాత మాట్లాడాల్సింది ఆది పనిశెట్టి. అతన్లో ఎంత గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడో మరోసారి నిరూపించాడు. ప్రెసిడెంట్ పాత్రలో జగపతిబాబుకు ఇది మెమరబుల్ రోల్. ప్రకాష్ రాజ్ పాత్ర ఆద్యంతం ఆశ్చర్యపరుస్తుంది. రంగమ్మత్తగా  అనసూయకు ఇది జీవితాంతం గుర్తుండే పాత్ర. ఇతర పాత్రల్లో నరేష్, రోహిణి, మహేష్, సత్య, అజయ్ ఘోష్.. ఇలా ఒక్క ప్రకాష్ రాజ్ తప్ప అందరూ తెలుగు ఆర్టిస్టులతోనే చేయించడం వారంతా బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడం గొప్ప విషయం. ఆర్టిస్టులు కాకుండా టెక్నికల్ గా ఈ సినిమాకు మరికొందరు హీరోలున్నారు. మొదటి హీరో సుకుమార్.. తర్వాత దేవీ శ్రీ ప్రసాద్.. పాటలే కాదు, నేపథ్య సంగీతంతో అద్భుతం అనిపించాడు. ఆర్ట్ వర్క్ ఈ సినిమాకు అసలు ప్రాణం. ఆ కాలాన్ని అద్భుతంగా పోర్ట్రెయిట్ చేశారు. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కూడా రియలిస్టిక్ గా మెప్పిస్తాయి. కొరియోగ్రఫీ కాస్త వీక్ గా కనిపిస్తుంది. మంచి బీట్స్ ఉన్న పాటలకు మరింత మంచి స్టెప్పులు ఇచ్చి ఉండాల్సింది అనిపిస్తుంది.  ఈ సమ్మర్ ను బిగ్గెస్ట్ హిట్ టాక్ తో మొదలుపెట్టింది రంగస్థలం. ముందు నుంచీ వినిపిస్తోన్న దాన్ని బట్టి రంగస్థలం చాలాకాలం తర్వాత వచ్చిన అచ్చమైన తెలుగు సినిమా. చిట్టిబాబు చాన్నాళ్ల తర్వాత మనకు కనిపించిన అచ్చ తెలుగు హీరో. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురుస్తుందంటే ఆశ్చర్యమేం లేదు. 

చివరిగా:
మనకథలుగా వస్తున్న కథలు మనవి కాదన్ని విషయం మనకూ తెలుసు.. కానీ మట్టి వాసనలు పులుముకున్న కథ తెలుగు తెరను తాకి చాలాకాలం అయ్యింది. రంగస్థలం తెలగుదనం నిండిన కథ
రాంచరణ్, సమంత నటనాస్థాయి కి రంగస్థలం కొలబద్దగా నిలుస్తుంది. రాంచరణ్ కి చిట్టిబాబు పాత్ర ఒక పచ్చబొట్టులా మిగిలిపోతుంది. సుకుమార్ దర్శకత్వం ప్రతిభకు పరిధులను పెట్టడం సాధ్యం కాదు. మొత్తంగా రంగస్థలం తెలుగు సినిమా కథలకు కొత్త దారి చూపించింది. 


Read Also
Hindudarmam Live Profit Your Trade
NRI Edition
AP News
Telangana News
Nijam
Pata
Sports
Daily Specials