ప్రేమించిన పాపానికి ఓ యువతిని..

ఇద్దరు యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ ఇది గ్రామపెద్దలకు నచ్చలేదు. అంతే…. పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని గొడ్డును బాదినట్లు బాదారు…. కొట్టడం, తన్నడం, నెట్టేయడం, బూతులు తిట్టడం ఒకటేంటి… నాగరిక సమాజంలో బతుకుతున్న ఒక సగటు జీవి చేయకూడని పనులన్నీ చేశాడు.. ఆ గ్రామ పెద్ద. అమ్మాయి అన్న కనీసం ఇంగితం కూడా లేకుండా పశువులా ప్రవర్తించాడు….

అనంతపురం జిల్లా గుమ్మగుట్ట మండలం పి.కె.దొడ్డి గ్రామంలో జరిగిందీ దారుణ ఘటన. దళిత కులానికి చెందిన ప్రేమజంట వ్యవహారాన్ని పంచాయితీ పెట్టి పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు ఆ గ్రామ పెద్దలు. ఆ సందర్భంగానే ఇలా పైశాచికంగా ప్రవర్తించారు. కన్నవారికే పిల్లలపై చేయి చేసుకునే అధికారం లేని నేటి సమాజంలో.. పంచాయతీ పెద్దలు ఇలా దాడి చేయడమేంటని నిలదీస్తున్నారు.. దళిత సంఘాల నేతలు. ఇలాంటి ఆటవిక సంస్కృతి కొనసాగకుండా ఉండాలంటే… పంచాయతీ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

జగన్ ప్రభుత్వంపై పారిశ్రామికవేత్త సంచలన ట్వీట్‌

Fri Aug 16 , 2019
జగన్ ప్రభుత్వంపై ప్రముఖ కర్నాటక పారిశ్రామిక వేత్త మోహన్‌దాస్ పాయ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం కొనసాగుతోందని అన్నారు. పీపీఏలపై సమీక్ష జరపడంపై పాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జపాన్ కంపెనీలు లేఖరాసిన తర్వాత అయిన కళ్లు తెరవాలి కదా అంటూ ప్రశ్నించారు మోహన్ దాస్.. సింగపూర్‌ ఇప్పటికే అమరావతిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టిందని.. అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మోహన్‌ దాస్ […]