అద్భుతం.. ఆ గుడిలో దీపం నీటితో వెలుగుతుంది..

నిప్పుని ఆర్పాలంటే నీళ్లు కావాలి. దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి కావాలి. కానీ కొన్ని అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ కోవెలలోని దేవుడికి నూనెతో పని లేకుండా నీటితో దీపారాధన చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతం కనిపిస్తుంది. గత ఐదేళ్ల నుంచి ఈ అఖండ జ్యోతి వెలుగులు పంచుతూనే ఉంది. దేశంలోని చాలా దేవాలయాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా ఇక్కడి ఆలయంలోని జ్యోతి మాత్రం చాలా ప్రత్యేకమైనదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు వెలుగుతూనే ఉంటుందన్నారు. ఆలయ పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ఇంతకు ముందు నూనెతోనే దీపారాధన చేసేవారం. కానీ ఒక రోజు అమ్మవారు కలలో కనిపించి నీటితో జ్యోతి వెలిగించమని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం ఆరోజు నుంచి అలానే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది అని తెలిపారు. అయితే తాను నీటితో దీపాన్ని వెలిగిస్తున్నానని చెబితే ఎవరూ నమ్మరని చాలా కాలం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. ఈ ఆలయం నదీ తీరంలో ఉండడం వలన వర్షాకాలంలో పూర్తిగా నీట మునుగుతుంది. దీంతో వర్షాకాలమంతా ఆలయాన్ని మూసే ఉంచుతారు నిర్వాహకులు. మళ్లీ దసరా నవరాత్రులకు ఆలయాన్ని తెరిచి పూజాదికాలు నిర్వహిస్తారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

Thu Jun 6 , 2019
కీలక వడ్డీరేట్ల తగ్గిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. సోమవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన సమావేశ నిర్ణయాలను ఆర్‌బీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. రెపో రేటు పావు శాతం తగ్గింది. తాజా తగ్గింపుతో రెపో రేటు 5.75 శాతానికి దిగివచ్చింది. రెపో రేటు తగ్గింపునకు తొలిసారిగా ఆరుగురు సభ్యులు గల ఎంపీసీ సమావేశంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఇక ఎంఎస్‌ఎఫ్‌తోపాటు.. బ్యాంక్‌ […]