బిల్లు మంజూరు చేసేందుకు రూ. 7 లక్షలు లంచం డిమాండ్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. KTPS పవర్‌ ప్లాంట్‌ చీఫ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆనందం.. ఓ బిల్లు మంజూరు విషయంలో లంచం డిమాండ్‌ చేశాడు. 70 లక్షల విలువైన బిల్లు మంజూరు చేసేందుకు 10 శాతం డబ్బులు ఇవ్వాలని కాంట్రాక్టర్‌ లలిత మోహన్‌పై ఒత్తిడి తెచ్చాడు. రూ. ఏడు లక్షలు తన వల్ల కాదని అనడంతో.. చివరికి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.

సీ‌ఈ లంచాల బాగోతంపై కాంట్రాక్టర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. పథకం ప్రకారం వలపన్ని ఎస్‌ఈ ఆనందంను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి ఇలా లంచాల కోసం దిగజారడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

TV5 News

Next Post

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు

Thu Oct 10 , 2019
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ సంఘాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. ప్రభుత్వం తరఫున న్యాయవాది రామచందర్‌ రావు, కార్మిక సంఘాల జేఏసీ తరఫున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. అటు ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల వైఖరితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అదనపుచార్జీలు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌లున్నవారికి […]