బీజేపీలో చేరిన సినీ నటి నమిత

Read Time:0 Second

namitha

సినీ నటి నమిత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయప్రకాశ్ నడ్డా సమక్షంలో శనివారం ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరారు. కాగా నమిత దక్షిణాదిన పలు భాషల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగులో సొంతం సినిమాతో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నమిత ఆ తరువాత జెమిని, బిల్లా, సింహా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

గతకొంత కాలంగా ఆమెకు అవకాశాలు తగ్గడంతో.. సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఎన్నికలకుముందే బీజేపీలో చేరుతారని అంతా భావించారు, ఆమె తమిళనాడులో బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతారని అప్పట్లో ప్రచారం జరిగింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close