టాప్ గేర్ లో నభా నటేష్..

ఈ మధ్యకాలంలో కుర్రకారును ఉర్రుతలూగిస్తున్న హీరోయిన్ ఎవరంటే.. టక్కున గుర్తుకు వచ్చేది నభా నటేష్. తాజాగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో మాంచి ఊపుమీదున్న నభా కెరియర్ కి టాప్ గేర్ కి పడింది. “నన్నుదోచుకుండువటే”లో సిరి , ” ఇస్మార్ట్ శంకర్ “సినిమాలతో అలరించింది. దీంతో నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్ గా మారిపోయింది. సాయిధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సో బెటర్” రవితేజ తో “డిస్కో రాజా” వంటి ఫ్యూచర్ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది.

ఇదిలావుంటే సినిమాల తోపాటు నిరంతరం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే.. ఈ చిన్నది తాజాగా మెర్సిడస్ బెంజ్ కారు తో దిగిన ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫిక్స్ లో నభా లుక్స్ హాట్ గా ఉన్నాయి. తన సోషల్ మీడియా ఫాలో వర్స్ కి గ్రాట్టిట్యూ డ్ చెబుతూ ఈ ఫిక్స్ ని షేర్ చేసింది నభా నటేష్.

TV5 News

Next Post

మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధుడు

Mon Oct 14 , 2019
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. తల్లి కూలి పని కోసం వెళ్లినప్పుడు.. ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై.. పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలిక ఏడుస్తుండడంతో గ్రామస్తులు విషయం అడిగారు. ఆ వెంటనే.. చిన్నారి తల్లికి సమాచారం ఇచ్చారు. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాలి తల్లి అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. […]