ఘోర రోడ్డు ప్రమాదం.. 29 మంది దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో నుంచి ఢిల్లీకి వస్తున్న ఓ బస్సు… ఆగ్రా వద్ద ఇవాళ ఉదయం డ్రైనేజీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రయాణికులు మరణించారు. యూపీ రోడ్‌వేస్‌కు చెందిన స్లీపర్ కోచ్ ప్యాసింజర్ బస్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై వేగంగా వస్తూ 15 అడుగుల లోతున్న డ్రైనేజీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 29 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోగా.. మరో మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని మురుగు కాల్వ నుంచి బయటికి తీసి…. ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించాలని సీఎం జిల్లా కలెక్టరును ఆదేశించారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?

Mon Jul 8 , 2019
కర్ణాటకలో ఏం జరగబోతోంది? 13 నెలల సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడినట్లేనా? స్పీకర్ రమేష్ కుమార్ రాజీనామాలు ఆమోదిస్తారా? గవర్నర్ వజూభాయ్ వాలా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? రాబోయే 24 గంటల్లో కర్ణాటక రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకోబోతున్నాయ్..అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి బంతి మాత్రం స్పీకర్‌ కోర్టులోనే కనిపిస్తోంది. స్పీకర్‌ ముందు నాలుగు ఆప్షన్లు కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో […]