మేం విడిపోలేదు.. కలిసే ఉన్నాం

బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌ సోదరుడు, మోడల్‌ రాజీవ్‌ సేస్‌ మధ్య వచ్చిన మనస్పర్థలు వచ్చినట్టుగా జరిగిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. జూన్ 7న వీరిద్దరూ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఏడాది పాటు ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని దీంతో వారు విడిపోయారనే ప్రచారం జరిగింది. అలాగే వారి సోషల్‌ మీడియా పేజిలలో జరిగిన కొన్ని మార్పులు కూడా ఈ వార్తలకు బలం చేకూరేలా చేశాయి. రాజీవ్, చారులు .. వారి పేజ్‌లను ఒకరికొకరు అన్‌ఫాలో చేసుకోవడం, ఇద్దరూ కలిసున్న ఫోటోలను ప్రొఫైల్‌ నుంచి తీసివేయడంతో గొడవలు ఉన్నాయన్న వార్తలు బీ టౌన్‌లో హల్ ‌చల్ చేశాయి.

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజీవ్‌ అందరి నోరు మూయించేలా ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్న ఓ ఫోటోను పెట్టి ‘మా తొలి ఢిల్లీ డిన్నర్‌ డేట్‌’ అనే క్యాప్షన్‌‌ను జత చేశాడు. వారిపై జరుగుతున్న ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. అలాగే ఒకరి ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ను మరొకరు తిరిగి ఫాలో అవుతున్నారు. ముందు అన్‌ఫాలో చేసి తిరిగి ఫాలోవ్వడం అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వన్ అండ్ వోన్లీ.. వన్‌ప్లస్.. మార్కెట్లో దానిదే హవా

Thu Aug 1 , 2019
దేశీయ మొబైల్ మార్కెట్లో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తుల సంస్థ వన్‌ప్లస్ అగ్రగామిగా నిలుస్తోంది. ప్రీమియం సెగ్మెంట్ మోడళ్లలో యాపిల్, శాంసంగ్‌‌కు ఉన్న షేర్లను పక్కన పెట్టి పైపైకి పోతున్నాయి వన్‌ప్లస్ షేర్లు. లాభాల బాట పయనిస్తున్నాయి. ఈ ఏడాది దేశంలోకి దిగుమతి అయిన మొత్తం ప్రీమియం ఫోన్లలో 43 శాతం వన్‌ప్లస్‌వే అని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించింది. 22 శాతం షేరుతో కొనసాగుతున్న దక్షిణకొరియా దిగ్గజ మొబైల్ […]