తెలంగాణలో మరో సమ్మె.. ఈనెల 19 నుంచి..

తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వర్గం కూడా సమ్మెకు దిగబోతోంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది. ఓలా, ఉబర్, ఐటీ కంపెనీలకు సేవలు అందిస్తున్న50వేల మంది క్యాబ్ డ్రైవర్లు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ షేక్ సలావుద్దీన్ సమ్మె విషయాన్నీ వెల్లడించారు.

తమ సమస్యలు పరిష్కరించాలని ఈ ఏడాది ఆగస్ట్ 30న తెలంగాణ రవాణాశాఖకు లేఖ ఇచ్చామని.. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాము సమ్మె చేయాలనీ నిర్ణయించుకున్నామన్నారు. అయితే సమ్మెకు వెళ్లాలా వద్దా అనే విషయంపై అసోసియేషన్‌లో ఓటింగ్ జరిపామని.. 75శాతం మంది సమ్మె చేయాలని ఓటు వేసినట్టు సలావుద్దీన్ తెలిపారు. దీంతో ఈనెల 19 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు స్పష్టం చేశారు.

TV5 News

Next Post

సింహానికే సవాలు.. అలాంటివారే మనిషా, జంతువా అని పట్టించుకోరట..

Thu Oct 17 , 2019
ఢిల్లీ జూలోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దూకడం కలకలం రేగింది. మెటల్‌ గ్రిల్స్‌ దాటి ఆ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. కొన్ని నిమిషాల పాటు అతను సింహంతో పరాచకాలు ఆడాడు.. అయితే అదృష్టవశాత్తు అతనికి ఏమి కాలేదు. బిహార్‌కు చెందిన 28 ఏళ్ల రెహన్ ఖాన్‌ గురువారం ఢిల్లీ ఓ జూ కు వెళ్ళాడు. వెళ్లినవాడు తన మానాన తాను ఉన్నాడా అంతే లేదు. ఎవరు లేని […]