అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం

ఓం నమశ్శివాయ.. భంభంబోలే.. అంటు శివభక్తులు అమర్ నాథ్ యాత్రకు బయలుదేరారు. జమ్ము బేస్‌క్యాంప్ నుంచి ఆదివారం ఉదయం అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల మొదటి బృందం ప్రయాణం ప్రారంభమైంది. మంచుకొండల్లో సహజసిద్దంగా కొలువైన మహాశివుని మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు బయలుదేరారు. ఆది శంకరుడిని కొలుచుకునేందుకు బయలుదేరిన భక్తుల బృందానికి సంబంధిత అధికారులు పచ్చరంగు జెండా ఊపి ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 46 రోజుల పాటు కొనసాగే ఈ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 15 వరకూ కొనసాగనుంది.

మహాశివలింగాన్ని దర్శించుకునేందకు అమర్ నాథ్ యాత్రీకులు భారత దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. యాత్రికులకు భద్రతతోపాటు సౌకర్యాల కల్పనకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. యాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా సైన్యం పహారా కొనసాగుతోంది.

పాంప్లెట్లలో ఈ యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నాయి. అలాగే యాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనల సమాచారం ఉంది. యాత్రకు వెళ్లే భక్తులు… అవి పాటించాల్సి ఉంటుంది. జమ్మూకాశ్మీర్ టూరిజం విభాగం చేసిన ఏర్పాట్లను చూసి… భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొంతమందిని ప్రత్యేకంగా నియమించి.. వారి సేవల్ని ఈ యాత్ర కోసం వినియోగిస్తున్నారు. ఇక స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, సిబ్బంది సైతం యాత్రికులకు పూర్తి సమాచారం ఇస్తూ.. ఈ యాత్ర విజయవంతంగా పూర్తయ్యేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నిండు గర్భిణి అని కూడా చూడకుండా.. మానవత్వం మరిచి..

Mon Jul 1 , 2019
అమ్మ కడుపులోనుంచి బయటకైనా రాలేదు. ప్రపంచం ఎంత దారుణంగా ఉందో తెలియడానికి. ఆమె మీద ఎందుకు కక్ష గట్టారో కానీ.. నిండు గర్భిణీ అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశారు. మనుషుల్లో మానవత్వం నశించిపోయిందని రుజువు చేశారు. ఈ దాడిలో మహిళ మృతి చెందగా కడుపులోని బిడ్డను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. లండన్ క్రొయిడన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కత్తి పోట్లకు గురై రోడ్డు మీద […]