భారీ తగ్గింపు ఆఫర్లతో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’

భారత్‌లో ఆరేళ్ళు పూర్తిచేసుకున్న సందర్బంగా అలాగే పండుగల సీజన్‌ ను పురస్కరించుకుని ప్రముఖ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం కలిగినవారు మాత్రం సెప్టెంబర్‌ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఆఫర్లను అందిపుచ్చుకోవచ్చు. ఈ ఆఫర్‌లో భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఉన్నట్లు అమెజాన్ ప్రకటించింది. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపు చేసివారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ కూడా ఉంటుందని చెప్పింది. ఈ ఆఫర్ లో లక్షకు పైగా ఫ్యాషన్‌ డీల్స్, 1200 బ్రాండ్స్‌ ఉంటాయని స్పష్టం చేసింది.

దుస్తులు, పాదరక్షలు, బ్లూ టూత్‌లపై 70 శాతం , వాచీలపై 80 శాతం, బెస్ట్‌ సెల్లింగ్‌ బుక్స్‌పై 70 శాతం, నగలపై 90 శాతం, కిచెన్‌ ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని వెల్లడించింది. కిచెన్ ఉత్పత్తుల విభాగంలో 50వేలకు మించి వస్తువులు అందుబాటులో ఉన్నాయని.. వీటిలో సగానికిపైగా ఉత్పత్తులపై, 50 శాతం డిస్కౌంట్ ఉండనుందని చెప్పింది. అలాగే ప్రముఖ కంపెనీలు శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ, ఓపో, వివో స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్, అలాగే అదనపు క్యాష్‌బ్యాక్, నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లను ఇందులో అందించనుంది. వీటిలో ఎక్స్చేంజి ఆఫర్‌ కింద రూ. 6,000 వరకు ఇవ్వనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ఇక టాప్‌లోడ్‌ వాషింగ్‌ మెషిన్‌ ప్రారంభ ధర రూ. 9,999 కాగా, స్ప్లిట్‌ ఏసీలపై 45 శాతం వరకు తగ్గింపు ఉంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ముందుగా పంచెతో అనుకున్నా.. కుదరకపోవడంతో..

Wed Sep 18 , 2019
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందించారు. కోడెల తన ఇంట్లోని కేబుల్ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. సూసైడ్ చేసుకునేందుకు కోడెల చాలా ఆలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా పంచెతో ఉరి వేసుకొని చనిపోవాలనుకున్నా, అది కుదరకపోవడంతో కేబుల్‌వైర్‌తో హ్యాంగయ్యారు.. కోడెల మెడపై ఉన్న గుర్తులను బట్టి అది కేబుల్ వైరేనని తేల్చారు. ఆరోగ్యం బాగోలేక […]